Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మానవత్వం ఉన్న ఉగ్రవాదులం... అమర్నాథ్ యాత్రపై దాడి చేయం

ఉగ్రవాదుల్లో కూడా మానవత్వం ఉన్నవారు కొందరుంటారని వారు చాటుకున్నారు. హిందువులు చేపట్టే పవిత్ర యాత్రల్లో అమర్నాథ్ యాత్ర ఒకటి. ఈ యాత్ర కోసం లక్షలాది మంది హిందూ భక్తులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మంచు పర్వతా

Advertiesment
మానవత్వం ఉన్న ఉగ్రవాదులం... అమర్నాథ్ యాత్రపై దాడి చేయం
, బుధవారం, 27 జూన్ 2018 (17:29 IST)
ఉగ్రవాదుల్లో కూడా మానవత్వం ఉన్నవారు కొందరుంటారని వారు చాటుకున్నారు. హిందువులు చేపట్టే పవిత్ర యాత్రల్లో అమర్నాథ్ యాత్ర ఒకటి. ఈ యాత్ర కోసం లక్షలాది మంది హిందూ భక్తులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మంచు పర్వతాలపైకి వెళుతుంటారు. ఈ యాత్రికులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడులకు పాల్పడటం జరుగుతోంది. అయితే, ఈ దఫా మాత్రం ఉగ్రవాదులు తమలో ఉన్న మానవత్వాన్ని చాటుకున్నారు.
 
కాగా, ఈ సంవత్సరం జూన్ 26వ తేదీ మంగళవారం నుంచి యాత్ర ప్రారంభమైంది. గత ఏడాది దాడులు జరగటంతో ఈసారి ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. భక్తుల్లో కూడా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్రికులపై దాడులు చేయబోమని ప్రకటించారు. ఈ మేరకు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఆపరేషనల్ కమాండర్ రియాజ్ అహ్మద్ నైకూ పేరుతో ఓ ఆడియో విడుదలైంది. 
 
దాని సారాంశం ఇలా ఉంది. మీకు భద్రత అవసరం లేదు. మీరు మా అతిథులు. వాళ్లు తమ మత విశ్వాసాలకు అనుగుణంగా ఇక్కడికి వస్తున్నారు. మేం ఎలాంటి దాడి ప్రణాళిక రచించలేదని నైకూ ఆడియో ద్వారా తెలిపాడు. 1990లో కాశ్మీర్ వదిలి వెళ్లిన పండిట్‌‍లు తిరిగి రావచ్చు. వాళ్లకు ప్రత్యేకంగా కాలనీలు ఉండకూడదు అనే షరతు అందులో ఉంది. అమర్నాథ్ యాత్రపై దాడులు చేయం అంటూ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
ఉగ్రవాదుల్లోనూ మంచి వాళ్లు ఉంటారా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఉగ్రవాద సంస్థ నుంచి హామీ వచ్చినా.. భద్రత విషయంలో రాజీ పడేది లేదని జమ్మూకాశ్మీర్ డీజీపీ వాయిద్ స్పష్టం చేశారు. అమర్నాథ్ యాత్రకు కట్టుదిట్టమైన భద్రత కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, కేంద్ర బలగాలు కూడా డేగ కన్నుతో నిఘాను పర్యవేక్షిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇరాన్ నుంచి చమురు దిగుమతులొద్దు.. వంద శాతం సుంకాలా?: ట్రంప్