Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

డీవీ
శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (19:41 IST)
Manyam Dheerudu
అల్లూరి సీతారామరాజు కథ నాటకాలనుంచి సినిమాలవరకు అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ క్రిష్ణ కూడా ఆ పాత్రలో జీవించేశారు. అలాంటి సినిమా మరలా వెండితెరపైకి వచ్చింది.  చిత్ర నిర్మాత ఆర్.వి.వి.సత్యనారాయణ తానే నిర్మించి టైటిల్ పాత్ర పోషించారు.  ఆర్.పార్వతిదేవి సమర్పణలో తెరకెక్కించారు. నరేష్ డెక్కల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఎలావుందో పరిశీలిద్దాం.
 
కథ:
కోస్తా ఆంధ్రలో మన్యం ప్రాంతంలో మన్యం వీరుడుగా పేరుపొందిన అల్లూరి సీతారామరాజు కథే ఇది. అది బ్రిటీష్ పాలకుల కాలం. సహజసిద్ధంగా లభించిన భూమిని అక్కడి ప్రజలు సాగుచేసుకుంటూ జీవనాన్ని వెలిబుచ్చుతుంటారు. అలాంటి మన్యం ప్రజలపై అప్పటి బ్రిటీష్ దొరలు ఆ పరిసర సామంతులద్వారా పన్ను వసూలు చేస్తుంటారు. దీనికి వ్యతిరేకి అయిన అల్లూరి సీతారామరాజు విభేదిస్తాడు. ఇది తెలిసిన బ్రిటీష్ వారు ఏమి చేశారు?  సీతారామరాజు వారిని ఏ విధంగా ముప్పుతిప్పలు పెట్టి... ప్రజల తరఫున పోరాడాడు? మనకూ స్వాతంత్రం కావాలని వారిని ఎలా మేలుకొల్పాడు? గూడేళ్లో వారి జీవిన విధానం ఎలా వుంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
 
సమీక్ష:
ఇలాంటి వీరుల కథలు ఇప్పటితరం తెలుసుకోవాల్సిన అవసరం వుంది. వెండితెరపై దాన్ని మరింతగా చూస్తూ అప్పటి పరిస్తితులను అవగాహన చేసుకొనేందుకు వీలు కలిగింది. ఇప్పటితరం టెక్నాలజీలో పడిపోయి పోరాట యోధుల కథలు మర్చిపోయారనే చెప్పాలి. ఇప్పటి ప్రభుత్వాలు కూడా  ఆయన మరణం రోజున స్మరించుకోవడం జరుగుతూనే వుంది. గతంలో అల్లూరి సీతారామరాజు జీవిత కథను బేస్ చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. 
 
ఈ సినిమాకు ముఖ్యమైన ఘట్టం మన్యం ప్రాంతంలోని చింతపల్లి, రాజవొమ్మంగి తదితర పోలీస్ స్టేషన్లపై సీతారామరాజు దాడి చేసి ఆయుధాలను అపహరించడం, వాటితో బ్రిటీష్ వారిపై పోరాటం చేయడంలాంటి సన్నివేషాలన్నీ ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తాయి. అప్పటి మన్యం కలెక్టర్ రూథర్ ఫర్డ్ తీసే సన్నివేశాలు యూత్ ను అలరిస్తాయి. సన్నివేశపరంగా వచ్చే డైలాగ్స్ కూడా ఎమోషన్ కు గురిచేస్తాయి. ఇక నటుడు రంగస్థలం నుంచి రావడం వల్ల డైలాగ్ డెలివరీ కూడా స్పష్టంగా వుంది.
 
ఫస్ట్ హాఫ్ కాస్త నిదానంగా అనిపించినా, సెకెండాఫ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ ఆసక్తిరేపేలా వుంది. దాంతో ఆడియన్స్ ఎక్కడా బోరింగ్ గా ఫీల్ అవ్వరు. దానితోపాటు జబర్దస్థ్ అప్పారావు పాత్ర ఆటవిడుపులా వుంది. మరోవైపు ఓ యువజంట ప్రేమాయణం  రన్ అవుతూ యూత్ కు కనెక్ట్ అయ్యేలా చేశాడు. మద్య సేవించడం సమాజానికి, కుటుంబానికి మంచిది కాదని చెప్పే ప్రయత్నం బాగుంది. 
 
మన భూమిన మనం దుక్కి దున్ని పన్ను వేరేవారికి ఎందుకు కట్టాలి? మన పంటలను వాళ్లకు ఎందుకు ధారాదత్తం చేయాలి అనే అనేక అంశాలను ఇందులో చూపించారు. ఓవరాల్ గా ఈ మన్యం ధీరుడు పేరుతో వచ్చిన ఈ సినిమా బ్రిటీష్ వారిపై పోరాడిన వీరయోధునికథ.
 
ఇక నటనాపరంగా రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి.సత్యనారాయణ టైటిల్ పాత్రలో అమరారు. ఆహర్యం, డైలాగ్ డెలివరి, డిక్షన్ బాగున్నాయి. దీనికోసం గుర్రపుస్వారీ, కత్తియుద్ధం, విల్లు విద్యలు నేర్చుకుని నటించడం రియల్ స్టిక్ గా వుంది. ఓ యథార్థకథను ప్రజల ముందుంచే ప్రయత్నం చేయడం అభినందనీయం. అలాగే  మల్లుదొర పాత్రలో జీవీ త్రినాథ్ కూడా బాగా నటించారు. యాక్షన్ సన్నివేశాల్లో బ్రిటీష్ వారికి, సీతారామరాజుకు మధ్య జరిగే భీకర సన్నిశాల్లో మల్లుదొర పాత్ర కూడా ఎంతో ప్రాధన్యత సంతరించుకుంది. ఇంకా ఇందులో సత్తి పండు, కలెక్టర్ రూథర్ ఫర్డ్ పాత్రలో ఉమేద్ కుమార్ పాత్రతో పాటు పలువురు వారి పరిధిమేరకు నటించారు.
 
సాంకేతికంగా చూస్తే, మన్యంలో గూడెం సెట్ నాచురల్ గా వేశారు. అర్ట్ వర్క్,  సినిమాటోగ్రఫీ తగినట్లుగా వుంది. మన్యం అందాలు, గూడెం ప్రాంతాలును అరుకు, పాడేరు, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ ప్రదేశాలలో చిత్రీకరించారు.  సీతారామరాజు ఎస్టాబ్లిష్ షాట్స్ బాగున్నాయి.  అయితే పాటల పిక్చరైజేషన్ ఆకట్టుకోనేదిగా చూపించారు. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా వుంది. కథను సినిమా నిడివి అయిన రెండుగంటలలోపే ఇమడ్చడం విశేషం. అయితే అల్లూరిసీతారామరాజు  పాత్రను పేరున్న హీరో ధరిస్తే సినిమా మరో స్థాయిలో వుండేది. కానీ నిర్మాతే ఆ పాత్ర నచ్చి చేయడం అభినందనీయమే.
రేటింగ్: 2.75\5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతి లడ్డూ వివాదం- వైవీ పిటిషన్‌పై సెప్టెంబర్ 25న విచారణ

లేపాక్షి కళంకారీ బ్యాగును ఆద్యకు కొనిపెట్టిన పవన్ కల్యాణ్ (వీడియో)

తిరుమల పవిత్రతను చంద్రబాబు పాడు చేశారు.. జగన్ ఫైర్

రూ.6,585 కోట్లు- 384 కిలోమీటర్ల పొడవైన ఏడు జాతీయ రహదారులు

శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగం నిజమే : ఈవో శ్యామల రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి ఆకులతో మధుమేహం పరార్.. ఇవి తెలిస్తే?

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments