అక్కినేని నాగేశ్వరరావు బతికి వుండగానే తన పేరిట జాతీయ స్థాయి అవార్డును ప్రకటించారు. చాలాకాలం సాగిన ఈ అవార్డును అనివార్య కారణాలవల్ల ఇవ్వలేకపోయారు. నేడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకను బంజారాహిల్స్ లో పివి ఆర్. సినీ మ్యాక్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, ప్రతి ఏడాది నాన్నగారిపేర అవార్డు ఇస్తున్నాం. ఏడాదికి ఇవ్వకపోయినా రెండేళ్ళ కోసారి ఇవ్వడం జరుగుతుంది. ఈ సారి అక్కినేని శతజయంతి అవార్డు చిరంజీవిగారికి ఇవ్వనున్నాం.
ఈ విషయాన్ని చిరంజీవిగారికి చెప్పగానే ఎంతో ఎమోషన్స్ లోనయి శతజయంతి అవార్డ్ తీసుకోవడం అంతకంటే పెద్ద అవార్డు లేదని వ్యాఖ్యానించారు. ఈ అవార్డును అమితాబ్ బచ్చన్ గారిని అడిగాం. ఆయన వస్తానన్నారు. అక్టోబర్ 28 న అమితాబ్ గారి చేతుల మీదుగా ప్రధానం చేయనున్నాము అన్నారు.
మెకానిక్ అల్లుడు తో అద్రుష్టం దక్కింది: చిరంజీవి
ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అక్కినేని నాగేశ్వర రావు గారు, ఆయన 100వ జయంతి సందర్భంగా అలనాటి గొప్ప నటులలో ఒకరు. నటనా మేధావి మరియు సినీ రంగానికి చెందిన ప్రముఖుడు, ANR గారు చిరస్మరణీయమైన ప్రదర్శనలు తెలుగు ప్రేక్షకుల హృదయాలలో మరియు మనస్సులలో నిలిచిపోయాయి. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి.
మెకానిక్ అల్లుడు సినిమాలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం, అదృష్టం నాకు దక్కాయి. నేను ఆ అనుభవంతో గొప్పగా సుసంపన్నం అయ్యాను మరియు ఆ క్షణాలను మరియు అతని అద్భుతమైన జ్ఞాపకాలను ఎప్పటికీ గౌరవిస్తాను అని తెలిపారు.