Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రికార్డ్-బ్రేకింగ్ వ్యూయర్‌షిప్‌ను సాధించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8

Advertiesment
Nag big boos 8

డీవీ

, గురువారం, 19 సెప్టెంబరు 2024 (13:41 IST)
Nag big boos 8
స్టార్ మా మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌లలో 1 సెప్టెంబర్ 2024 నుండి ప్రసారమవుతున్న ఎండెమోల్‌షైన్ ఇండియా యొక్క  బిగ్ బాస్ తెలుగు సీజన్ 8, దాని తొలి  వారంలో రికార్డ్ బ్రేకింగ్ వ్యూయర్‌షిప్‌ను సాధించింది. సూపర్‌స్టార్ నాగార్జున వరుసగా ఆరవ సారి హోస్ట్‌గా తిరిగి రావడంతో, ప్రీమియర్ ఎపిసోడ్ ఆకట్టుకునే 18.9 టీవీఆర్  (హైదరాబాద్)ను సంపాదించి, రికార్డ్-బ్రేకింగ్ హిట్‌గా సీజన్ స్థానాన్ని పదిలం చేసుకుంది. మొదటి వారంలో, ఈ షో విశేషమైన 5.9 బిలియన్ నిమిషాల వీక్షణను చూసింది, ఇది బిగ్ బాస్ తెలుగు చరిత్రలో కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది.
 
ఈ ప్రారంభం  పై ఎండెమోల్‌షైన్ ఇండియా, ఈవీపీ  మరియు హెడ్ కంటెంట్, తెలుగు - కన్నడ,  తబస్సుమ్ జలీబ్ మాట్లాడుతూ  "బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి అద్భుతమైన స్పందన రావడంతో మేము సంతోషంగా ఉన్నాము. ఈ సంఖ్యలు తమ విజయం పట్ల చాలానే చెబుతాయి. తెలుగు మాట్లాడే మార్కెట్‌లలోని ప్రేక్షకులతో ఈ ఫార్మాట్‌కు ఉన్న లోతైన అనుబంధానికి  ఇవి నిదర్శనం.  నాగ్ సర్ యొక్క ఆకర్షణ, షో యొక్క డైనమిక్ ఫార్మాట్, ఊహాతీత మలుపులను కలిగి ఉండటం వంటి అంశాలు వీక్షకులను ఆకట్టుకోవడం తో పాటుగా  ఇప్పటి వరకూ  మా అత్యంత విజయవంతమైన సీజన్‌ ఓపెనింగ్ గా కొనసాగుతోంది" అని అన్నారు.
 
బిగ్ బాస్ (బిగ్ బ్రదర్ యొక్క అనుసరణ) ఎండెమోల్‌షైన్ ఇండియా యొక్క అత్యంత విజయవంతమైన రియాలిటీ ఫ్రాంచైజీలలో ఒకటిగా నిలిచింది. భారతదేశంలో, బిగ్ బాస్ హిందీ, తమిళం, కన్నడ, మలయాళం మరియు తెలుగు వంటి బహుళ ప్రాంతీయ వెర్షన్‌లతో ఒక సాంస్కృతిక అద్భుతంగా స్థిరపడింది.  ప్రతి ఒక్కటి దాని ప్రత్యేక అభిమానుల సంఖ్య మరియు ప్రాంతీయ ఆకర్షణతో, ప్రతి సంవత్సరం కొత్త  మైలురాళ్లను సాధిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నిరాశ - 'దేవర' పాట రిలీజ్ వాయిదా