Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిగ్ బాస్‌ హోస్ట్‌గా బాలయ్య..!!

Balakrishna
, గురువారం, 2 నవంబరు 2023 (14:52 IST)
తెలుగులో ఒకప్పుడు రియాలిటీ షో అనగానే బిగ్‌బాస్ పేరే ముందు వినిపించేది. అప్పట్లో షో మీద విమర్శలు, ట్రోల్స్, కామెంట్లు ఎన్ని వచ్చినా రేటింగ్ మాత్రం తగ్గేది కాదు. ఇప్పటికీ ఓ వర్గం మహిళా ప్రేక్షకులు బిగ్‌బాస్‌ను చూస్తూనే ఉంటారు. గత కొన్ని సీజన్స్‌లో హిందీ, తమిళంతో పోలిస్తే తెలుగులో  బిగ్‌బాస్ రేటింగ్స్‌లో కాస్త వెనుకబడింది అన్న ప్రచారం జరుగుతోంది. తొలి మూడు సీజన్‌లకు జూనియర్ ఎన్టీఆర్, నాని, నాగార్జునలు హోస్ట్‌లుగా మారటంతో భారీ స్పందన తెచ్చుకున్నాయి.
 
ఇదిలావుంటే, సీజన్ 8 కోసం స్టార్ మా సంస్థ బాలయ్యని సంప్రదించినట్టుగా ప్రచారం జరగటం హాట్ టాపిక్‌గా మారింది. ఇది నిజమైతే బిగ్‌బాస్ షోకి అంతకన్నా మరొక ఎసెట్ ఉండదు. ఏ విషయం మీదనైనా నిర్మొహమాటంగా బాలకృష్ణ మాట్లాడే తీరు ఖచ్చితంగా బిగ్ బాస్ గేమ్‌ని కొత్త స్థాయికి తీసుకు వెళ్లటం పక్కా. వీకెండ్‌లో వచ్చే ఎలిమినేషన్ ఎపిసోడ్లలో బాలయ్య పార్టిసిపెంట్స్‌తో జరిపే మాటతీరు షోకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. 
 
పైగా, ఆయనతో ఉన్న చనువు, దృష్ట్యా సెలబ్రిటీలు షోకు అడగగానే వస్తారు. దీంతో సహజంగానే ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరుగుతుంది. ఇదే క్రమంలో షో నిర్వాహకులు బాలయ్య‌ను స్పంప్రదించారని. కానీ ఇంకా బాలకృష్ణ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తెలుపలేదని సమాచారం.‌ అన్ స్టాపబుల్ షోని బాలకృష్ణ నడిపించిన తీరు ఆహా ఓటిటికి చాలా మైలేజ్ తీసుకొచ్చింది. అది చూసే హాట్ స్టార్ నిర్వాహకులకు హోస్ట్‌గా  బాలయ్య అయితే బాగుంటుందన్న ఆలోచన వచ్చిందని చర్చ జరుగుతోంది.
 
ఇక ప్రస్తుతం‌ షో హోస్ట్‌గా ఉన్న నాగార్జున వచ్చే ఏడాది ప్రతిష్టాత్మకమైన తన వందో సినిమాను చేయాల్సి ఉంది. కుమారులతో అన్నపూర్ణ బ్యానర్‌పై వరుస సినిమాలకు ప్లాన్ చేస్తారని అంటున్నారు. ఒకవేళ బాలయ్య కాదంటే.. మళ్లీ నాగ్ కంటిన్యూ అవుతారా అనేది చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యన్టీఆర్, శోభన్ బాబు, ఆ తరువాత హరనాథ్