Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

డీవీ
శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (19:02 IST)
Akkineni family
అక్కినేని నాగేశ్వరరావు బతికి వుండగానే తన పేరిట జాతీయ స్థాయి అవార్డును ప్రకటించారు. చాలాకాలం సాగిన ఈ అవార్డును అనివార్య కారణాలవల్ల ఇవ్వలేకపోయారు. నేడు అక్కినేని నాగేశ్వరరావు  శతజయంతి వేడుకను బంజారాహిల్స్ లో పివి ఆర్. సినీ మ్యాక్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, ప్రతి ఏడాది నాన్నగారిపేర అవార్డు ఇస్తున్నాం. ఏడాదికి ఇవ్వకపోయినా రెండేళ్ళ కోసారి ఇవ్వడం జరుగుతుంది. ఈ సారి అక్కినేని శతజయంతి అవార్డు చిరంజీవిగారికి ఇవ్వనున్నాం.
 
ఈ విషయాన్ని చిరంజీవిగారికి చెప్పగానే ఎంతో ఎమోషన్స్ లోనయి శతజయంతి అవార్డ్ తీసుకోవడం అంతకంటే పెద్ద అవార్డు లేదని వ్యాఖ్యానించారు. ఈ  అవార్డును అమితాబ్ బచ్చన్ గారిని అడిగాం. ఆయన వస్తానన్నారు. అక్టోబర్ 28 న అమితాబ్ గారి చేతుల మీదుగా ప్రధానం చేయనున్నాము అన్నారు.
 
మెకానిక్ అల్లుడు తో అద్రుష్టం దక్కింది: చిరంజీవి
ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అక్కినేని నాగేశ్వర రావు గారు, ఆయన 100వ జయంతి సందర్భంగా అలనాటి గొప్ప నటులలో ఒకరు. నటనా మేధావి మరియు సినీ రంగానికి చెందిన ప్రముఖుడు, ANR గారు చిరస్మరణీయమైన ప్రదర్శనలు తెలుగు ప్రేక్షకుల హృదయాలలో మరియు మనస్సులలో నిలిచిపోయాయి. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి.
 
‘మెకానిక్ అల్లుడు’ సినిమాలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం, అదృష్టం నాకు దక్కాయి. నేను ఆ అనుభవంతో గొప్పగా సుసంపన్నం అయ్యాను మరియు ఆ క్షణాలను మరియు అతని అద్భుతమైన జ్ఞాపకాలను ఎప్పటికీ గౌరవిస్తాను అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పని ఒత్తిడి, అప్పుల బాధ.. ఏడో అంతస్థు నుంచి దూకేసిన టెక్కీ

యువరాజ్ సింగ్: బ్రెస్ట్ క్యాన్సర్‌పై నారింజ పండ్ల యాడ్, వివాదం ఏంటి?

సాక్షి మీడియా జగన్ చేతిలో ఉంది.. ఏదైనా నమ్మించగలడు.. వైస్ అభిమానులకు షర్మిల బహిరంగ లేఖ

పెళ్లైన కొత్త.. భర్తతో అలా షికారుకెళ్లింది.. అంతే సామూహిక అత్యాచారం

డ్యూటీని మరిచి క్రికెట్ ఆడేందుకు వెళ్లిన డాక్టర్లు.. చివరికి ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పుల మంచితనంతో మీ దీపావళి వేడుకలను ఆరోగ్యవంతంగా మలుచుకోండి

చింతకాయలు వచ్చేసాయి, ఇవి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా

తాటి బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

జామ ఆకులుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

ఈ వ్యాధులకు మునగకాయలు దివ్యౌధంలా పనిచేస్తాయి, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments