12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

దేవీ
శుక్రవారం, 21 నవంబరు 2025 (16:55 IST)
12A Railway Colony poster
నటీనటులు : ‘అల్లరి’ నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్, ‘వైవా’ హర్ష, ‘గెటప్’ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి ఇతర ప్రధాన తారాగణం.
సాంకేతికత: సినిమాటోగ్రాఫర్ : కుశేందర్ రమేష్ రెడ్డి, ఎడిటర్ : దర్శకత్వం: నాని కాసరగడ్డదర్శకుడు : డాక్టర్ అనిల్ విశ్వనాథ్, నిర్మాత : శ్రీనివాస చిట్టూరి, సంగీత దర్శకుడు : భీమ్స్ సిసిరోలియో
 
కథ :
కార్తీక్ (అల్లరి నరేష్) అనాధ. ముగ్గురు స్నేహితులుతో ఆవారాగా తాగుతూ తిరుగుతూ వుంటాడు. లోకల్ రాజకీయ నాయకుడు టిల్లు అన్న (జీవన్ కుమార్) దగ్గర పనిచేస్తుంటాడు. ఇంటిపక్కనే వుండే ఆరాధన (డాక్టర్ కామాక్షి భాస్కర్ల) కి లైన్ వేస్తుంటాడు. తను చేసే ఓ పనివల్ల ఆమె తలకు గాయమవుతుంది. సపర్యలు చేసే క్రమంలో ఆమె జీవితాశం తెలుసుకుని సాయం చేయాలనుకుంటాడు. ఆ విషయం చెప్పేందుకు ఆమె ఇంటికి వెళితే అక్కడ ఆమెతోపాటు ఆమె తల్లి మరణించి వుంటారు. కట్ చేస్తే, కార్తీక్ ఆసుపత్రిలో కనిపిస్తాడు. పోలీసు ఆఫీసర్ గా సాయికుమార్ పరిశోధనలో భాగంగా వస్తే, ఎక్కువ మాట్లాడలేడు. ఒత్తిడిచేసే గతం మరిచిపోయే ప్రమాదం వుందంటాడు డాక్టర్. ఆ తర్వాత కార్తీక్ బయటకు రావడం తన ఆరాధన ఎలా చనిపోయిందనేది పోలీస్ ఆఫీసర్ కంటే కార్తీక్ చేసిన పరిశోధనే మిగిలిన సినిమా.
 
సమీక్ష:
ఈ 12 ఏ రైల్వే కాలనీ అనే కథ వరంగల్ లోని ఓ ప్రాంతంలో జరిగిన కథగా దర్శక నిర్మాతలు చెప్పారు. జరిగి వుండవచ్చు, కానీ తీసిన విధానం గందరగోళంగా అనిపిస్తుంది. రాజకీయనాయకుడి కింద పనిచేసే అనుచరుడిగా కార్తీక్ పాత్ర డిజైన్ సరిగ్గా లేదు. ఇంటర్ వెల్ వరకు అసలు కథే పెద్దగా కనిపించదు. ఇంటర్ వెల్ తర్వాత జరిగే కథనం అంతా చాలా సిల్లీగా వుంటుంది. మర్డర్ మిస్టరీ కేసును శోధించే సాయికుమార్ పాత్ర డమ్మీగా మారింది. ప్రేమికుడిగా ఆరాదన గురించి తెలుసుకుని ఎవరు చంపారనేందుకు అతను చేసిన ప్రయత్నమే మిగిలిన కథ.
 
మనకు చాలా అర్థంకాని కలలు నిద్రలో వస్తుంటాయి. అలా కార్తీక్ కు హిమాలయాల్లో ఓ పాపను కాపాడే కల రావడం, అది నిజజీవితంలో బయట జరగడం వంటి సన్నివేశం ఒక్కటే సినిమాలో ప్రత్యేకత. ఇందులో ప్రతి పాత్రా వారి పరిధి మేరకు నటించారు. ముంబైలో పెద్ద డాక్టర్ అయిన అనీష్ కురువిల్లా తన కొడుకు ప్రాణాన్ని కాపాడేందుకు తన దగ్గరకు వచ్చిన పేషెంట్ ఆరాధన అమ్మను ఏవిధంగా ట్రాప్ చేశాడనేది ఇప్పటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న తంతుగా చెప్పవచ్చు.
 
అయితే ఆ క్రమంలో ఆరాదను పెండ్లిచేసుకోవాలనుకోవడమే పాయింట్ ప్రేమక్షకుడు జీర్ణించుకోలేకపోయాడనే చెప్పాలి. దానితో ఒక్కసారిగా కథ గాడి తప్పింది. ఇక ఆరాధన మర్డర్ విషయంలో తన బాస్ అయిన రాజకీయనాయకుడిని కూడా అనుమానించి అతని జీవితాన్ని నాశనం చేస్తాడు. ఇలా సాఫీగా సాగే కథకు మర్డర్ మిస్టర్ అనే రంగు పూసి మారేడు కాయలా దర్శకుడు చేసిన విధానం పెద్దగా లాభించలేదనే చెప్పాలి.
 
టీవీల్లో యూట్యూబ్ లోనూ.. చనిపోయినవారు ఏదో చెప్పాలను కొందరికే కనిపించడం అనే పాయింట్ ను దర్శకుడు తీసుకున్నా దానిని కూడా సరిగ్గా లాజిక్ పరంగా చెప్పలేకపోయాడు. చివరిలో కొన్ని సంఘటలను ఇలా జరిగాయి. అలా జరిగాయమని క్లిప్పింగ్ లు చూపించి ప్రేక్షకుడిని మెప్పించాలనుకున్నా లాభంలేకపోయింది.
 
పేరుకు తగినట్లుగా అల్లరి నరేష్ అల్లరి చిల్లరి నటనను కనబరిచాడు. సాయి కుమార్ ఓకే. హీరోయిన్ గా నటించిన డాక్టర్ కామాక్షి భాస్కర్ల పర్వాలేదు అనిపిస్తుంది. ఈ కథకు అభిరామి పాత్ర ట్విస్ట్. ఇక మిగిలిన పాత్రలన్నీ రొటీన్ గా వుంటాయి. లోకల్ లీడర్ టిల్లు పాత్ర ఓకే.  
 ‘వైవా’ హర్ష, ‘గెటప్’ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణిలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.  
 
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ బోర్ గా సాగాయి. ఫస్ట్ హాఫ్ ను ఇంకా బలంగా రాసుకుని ఉండాల్సింది. దీనికితోడు, సినిమాలో అనవసరమైన ల్యాగ్ సీన్స్ కూడా ఎక్కువైపోయాయి. పైగా ఈ సినిమా స్లో నేరేషన్ తో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఫేక్ ఎమోషన్స్ తో ప్లే సాగుతుంది. మొత్తానికి సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నా.. మధ్యలో కొన్ని అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశారు.
 
రచయిత డాక్టర్ అనిల్ విశ్వనాథ్, దర్శకుడు నాని కాసరగడ్డ ఈ క్రైమ్ థ్రిల్లర్ కి గుడ్ ట్రీట్మెంట్ ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు.  భీమ్స్ సిసిరోలియో సంగీతం పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగానే ఉంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాత శ్రీనివాస చిట్టూరి ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్లుగానే వున్నాయి. ఎంత చేసినా కథలో ఇంట్రెస్ట్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఇక అల్లరి నరేష్ కు ఏం నచ్చి ఈ సినిమా చేశాడో అర్థంకాదు.
రేటింగ్: 1.5/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు : దర్యాప్తులో విస్తుపోయే నిజాలు.... ఏంటవి?

ఫార్ములా ఇ-రేసింగ్ కేసు-గవర్నర్ ఆదేశాలు.. నన్ను అరెస్ట్ చేసే సీన్ లేదు: కేటీఆర్

Hyderabad: హైదరాబాద్-బెంగళూరు మధ్య కొత్త హై-స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్

ఈ-ఫార్ములా కేసు : అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు .. కేటీఆర్

భారత్- చైనా చేతులు కలిపితే అంతే సంగతులు.. అమెరికా కొత్త తలనొప్పి.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments