Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోపీచంద్ నటించిన భీమా ఎలా వుందంటే.. సినిమా రివ్యూ

డీవీ
శుక్రవారం, 8 మార్చి 2024 (16:48 IST)
bheema
నటీనటులు: గోపీచంద్, మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్, నరేష్, పూర్ణ, నాసర్, వెన్నెల కిషోర్, రోహిణి తదితరులు
 సాంకేతికత:  సినిమాటోగ్రాఫర్‌: స్వామి జె గౌడ, సంగీత దర్శకులు: రవి బస్రూర్, నిర్మాత: కేకే రాధామోహన్, దర్శకుడు: ఏ హర్ష
 
గోపీచంద్ హీరోగా సక్సెస్ కొట్టి చాలా కాలం అయింది. కొత్తగా కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన  మూవీ భీమా. సినిమా విడుదలకు ముందే అఖండతో పోలుస్తూ ప్రచారాలు జరిగాయి. దానికీ దీనికి సంబంధమే లేదన్నది చిత్ర యూనిట్. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది చూద్దాం.
 
కథ :
భీమా (గోపీచంద్) ముక్కుసూటి మనిషి. ట్రాన్స్ పర్లు అవుతూ మహేంద్రగిరి అనే ప్రాంతానికి వస్తాడు. రాగానే చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేసే పెద్ద మనిషి జాకీ ష్రాష్ తో ఢీ కొడతాడు. ఇంకోవైపు ఊరిలో చాలాకాలంగా మూతపడిన శివాలయంలో ఆయుర్వేద వైద్యం పేరుతో రవీంద్ర వర్మ (నాజర్) చిన్న పిల్లలపై ఏవో ప్రయోగాలు చేస్తాడు. వీరి గుట్టు తెలిసిన భీమాను శత్రువులు చంపేస్తారు. ఆ తర్వాత కథ ఏమిటి? భీమాకూ స్కూల్ టీచర్ విద్యతో ప్రేమాయణం ఎలా సాగింది? అనేవి సినిమాలో తెలుసుకోవాల్సిందే.
 
సమీక్ష:
గోపీచంద్ సినిమాలలో హ్యూమర్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఇందులో ఎస్.ఐ.గా తను అలా చేస్తూనే యాక్షన్ పార్ట్ బాగా డీల్ చేశాడు. దర్శకుడు హర్ష కథను బాగా డీల్ చేసినా కథనం ఇంకాస్త ఆకట్టుకునేలా వుంటే మరింత బాగుండేది. రొటీన్ కథకాకుండా ఓ సామాజిక అంశాన్ని తీసుకున్న విధానం బాగుంది. గోపీచంద్ పాత్రలో సర్ ప్రైజ్ బాగుంది.  మొదటి 15 నిముషాలు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో పాటు మున్ముందు కథ పై మంచి ఆసక్తిని ఏర్పరుస్తాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే ఎంతో బాగుండడంతో పాటు సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తిని ఏర్పరుస్తుంది. 
 
హీరోయిన్ మాళవిక ఎపిసోడ్ యూత్ ను అలరిస్తుంది. నరేష్, ముఖేష్ తివారీ, రఘుబాబు, చమ్మక్ చంద్ర పాత్రలో వినోదాన్ని చేసే ప్రయత్నం చేశారు. వెన్నెల కిషోర్, రోహిణి ల సన్నివేశాలు ఎంటర్ టైన్ చేస్తాయి.  రవి బస్రూర్  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది.
 
అయితే భీమా పాత్ర, టీచర్ లవ్ ట్రాక్ క్రుతంగా వున్నా కాసేపు ఎంటర్ టైన్ చేస్తుంది. మొదటి భాగమంతా భీమా పైనే నడుస్తుంది. కథ లోని  ప్రధాన అంశం చివరి వరకు సీక్రెట్ గా వుండడంతో మొదటి నుంచి అల్లరి చిల్లరిగా అనిపిస్తుంది. చివరి చెప్పిన అంశం సరి కొత్తగా వుంది.  స్క్రీన్‌ప్లే ముందు వెనుకగా చెప్పే ప్రయత్నం కొత్తగా వుందనుకున్న కొచెం అతిగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు ఫీలింగ్ కలుగుతుంది. 
 
గోపీచంద్ కు చక్కటి మాస్ యాక్షన్ సినిమాగా భీమా వుంది. స్వామి జె గౌడ  అందించిన సినిమాటోగ్రఫీ పర్వాలేదు. మంచి మాస్ సినిమాకి కావాల్సిన యాక్షన్ సీన్స్ బీమాలో బాగా సెట్ అయ్యాయి. గోపీచంద్ పాత్రలో ట్విస్ట్ లోగడ కొన్ని సినిమాల ఛాయలున్నా నేపథ్యం కొత్తగా వుండడంతో పెద్దగా ఆ ఎఫెక్ట్ కనిపించదు. ఈ సినిమా యాక్షన్ మాస్ డ్రామా మూవీ. లవ్ ట్రాక్ పేరుతో కొంచెం ఇబ్బంది కలిగించే సన్నివేశాలు కూడా వున్నాయి. దర్శకుడు ఎంచుకున్న అంశం సరికొత్తగా వుంది కాబట్టి దానిపైనే ఎక్కువ కాన్ సన్ ట్రేషన్ చేస్తే సినిమా మరింత బాగుండేది. చాలా కాలం తర్వాత గోపీచంద్ మాస్ యాక్షన్ సినిమాగా చెప్పుకోదగి సినిమాగా నిలుస్తుంది.
రేటింగ్: 2.75/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నివాస భవనంలోకి దూసుకెళ్లిన విమానం.. పది మంది మృతి... ఎక్కడ?

తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెను కిడ్నాప్ చేసిన వడ్డీ వ్యాపారులు.. ఎక్కడ?

పంట పొలంలో 19 అడుగుల కొండ చిలువ

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments