Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

50 సినిమాలు అనేది స్పెషల్ నంబర్ : అంజలి

50 years znapika to angali

డీవీ

, సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (13:15 IST)
50 years znapika to angali
నటి అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ ఎంటర్‌టైనర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. 2014లో తక్కువ బడ్జెట్‌తో రూపొంది బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్.  కోన ఫిల్మ్స్ కార్పొరేషన్, ఎం.వి.వి.సినిమాస్ బ్యానర్స్‌పై కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ తుర్లపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 22న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను శనివారం రిలీజ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌‌కు దర్శకుడు బుచ్చిబాబు, బాబీ, గోపీచంద్ మలినేని, హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథులుగా వచ్చారు. 
 
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘కోన వెంకట్ గారితో గత ఏడాది నుంచి పని చేస్తున్నాను. త్వరలోనే ఆయనతో ఓ చిత్రాన్ని చేస్తున్నాను. కథ మీద ఎక్కువగా దృష్టి పెడతారు. తొందర పెట్టరు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్ ఇలా అందరూ నాకు కావాల్సిన వాళ్లు. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. దర్శకుడికి మంచి పేరు రావాలి. మార్చి 22న థియేటర్లో అందరినీ నవ్విస్తూ, భయపెట్టి కలెక్షన్లు కొల్లగొట్టాలని కోరుకుంటున్నాను. అంజలి గారు యాభై సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఓ తెలుగమ్మాయి ఇన్ని సినిమాలు చేస్తూ సక్సెస్ సాధించడం గర్వంగా ఉంది. ఇంకా వంద, 150 ఇలా కంటిన్యూ చేస్తూనే ఉండాలి. నందు, భాను టాప్ రైటర్లు కాబోతోన్నారు. మార్చి 22న ఓం భీం బుష్ కూడా రాబోతోంది. అన్ని చిత్రాలు మంచి కలెక్షన్లను సాధించాలి’ అని అన్నారు.
 
అంజలి మాట్లాడుతూ.. ‘ఇది నాకు చాలా ప్రత్యేకం. గీతాంజలి నాకు ఫస్ట్ సెంట్రిక్ మూవీ. ఇది నాకు 50వ సినిమా. నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుంది. గీతాంజలి మళ్లీ వచ్చింది మరింత ఎక్కువగా నవ్విస్తుంది. భయపెడుతుంది. థియేటర్లో మంచి అనుభూతిని పొందుతారు. 50 సినిమాలు అనేది స్పెషల్ నంబర్. నాకెంతో ఆనందంగా ఉంది. దర్శకుడు శివకు మంచి భవిష్యత్తు ఉంది. శ్రీనివాసరెడ్డి, రాజేష్, అలీ, షకలక శంకర్, అవినాష్, రాహుల్ ఇలా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. టీం అంతా చాలా కష్టపడి చేశాం. సిద్దు విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ బాగుంటుంది. ఆర్ఆర్, పాటలు బాగా ఇచ్చారు. నందు, భాను రైటింగ్ బాగుంది. ఈ చిత్రానికి అన్నీ చక్కగా కుదిరాయి. కోన గారు ఈ సినిమాకు చాలా ప్రత్యేకం. పదేళ్ల తరువాత కూడా ఈ సినిమాను తీయగలిగాం అంటే.. అది ఆయన వల్లే. నిశ్శబ్దం టైంలోనే ఈ మూవీ పాయింట్ చెప్పారు. కానీ కథను రెడీ చేయడానికి ఇంత టైం పట్టింది. కానీ షూటింగ్‌ను మాత్రం చాలా వేగంగా పూర్తి చేశాం. మా ఈవెంట్‌కు వచ్చిన దర్శకులు బాబీ, గోపీచంద్ గారికి థాంక్స్. శ్రీ విష్ణు తన సినిమా రిలీజ్ అవుతున్నా కూడా మా కోసం రావడం చాలా గ్రేట్. మా రెండు చిత్రాలు పెద్ద విజయాన్ని సాధించాలి. మార్చి 22న గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.
 
కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘అంజలికి ఇది 50వ సినిమా. ఇది ఆమెకు ఎంతో ప్రత్యేకం. పదేళ్ల క్రితం గీతాంజలి వచ్చింది. అదొక ట్రెండ్ సెట్టర్. అన్ని భాషల్లో ఈ చిత్రం అప్పట్లో హిట్ అయింది. 3.5 కోట్లతో తీసిన గీతాంజలి అన్ని భాషల్లో విజయవంతం అయింది. గీతాంజలి మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు, లిరిక్ రైటర్ శ్రీజో ఇలా ఎంతో మంది పరిచయం అయ్యారు. ఓ మూవీ సక్సెస్ అయితే ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అవుతారు. మళ్లీ గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాను తీయడానికి పదేళ్లు పట్టింది. నాలుగేళ్ల క్రితం ఓ పాయింట్ తట్టింది. దాన్ని డెవలప్ చేసేందుకు ఇంత టైం పట్టింది. నందు, భాను  వల్ల ఈ సినిమా ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది. టెక్నీషియన్స్ అనే వాళ్లకి ఆకలి ఉండాలి. కొత్తలో ఆ ఆకలి ఉంటుంది. ఇక్కడకు వచ్చిన బాబీ, గోపీ ఇంకా ఆ ఆకలితోనే ఉన్నారు. నందు, భాను అలానే ఆకలితో ఉంటారు. శ్రీనివాస్ రెడ్డి వల్లే గీతాంజలి మొదలైంది. అతనే రాజ్ కిరణ్ దర్శకుడిని నా వద్దకు తీసుకొచ్చాడు. హారర్‌గా ఉన్న కథను.. హారర్ కామెడీగా మార్చాను. శ్రీను వల్లే గీతాంజలి పుట్టింది. గీతాంజలి సినిమాలో ఒక్క రోజు షూట్‌ కోసం వచ్చాడు. ఈ చిత్రంలో అలీ పాత్ర ఎక్స్‌ట్రార్డనరీగా ఉండబోతోంది. ఈ సినిమాలోని ప్రతీ పాత్ర ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. డీఓపీ సుజాత సిద్దార్థ్ విజువల్స్ బాగున్నాయి. శివ తుర్లపాటిని అమెరికా నుంచి పట్టుకొచ్చాం. ప్రవీణ్, శివ, శ్రీజో ఇలా చాలా మందిని ఇంపోర్ట్ చేశాం. శివకు ఈ సినిమా మంచి పేరు తీసుకు రావాలి. మార్చి 22న శ్రీ విష్ణు ఓం భీం బుష్ రిలీజ్ అవుతోంది.. మా సినిమా కూడా అప్పుడే వస్తోంది. అయినా కూడా మా ఈవెంట్‌కు వచ్చిన శ్రీ విష్ణుకి థాంక్స్. ఇలాంటి వారి వల్లే ఇండస్ట్రీ చాలా హెల్దీగా ఉంటుంది. ప్రేక్షకులందరూ మా సినిమాను చూసి ఆదరించండి’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హింసాత్మక వ్యక్తి అహింసాత్మకంగా మారిన కథ - నాని 32వ సినిమా