Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాండ‌ప్ రాహుల్ లో వ‌ర్ష‌బొల్ల‌మ్మ ఫ‌స్ట్ లుక్

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (15:22 IST)
Varsha Bollamma
రాజ్ త‌రుణ్ హీరోగా వ‌ర్షా బొల్ల‌మ్మ హీరోయిన్‌గా న‌టిస్తున్న సినిమా `స్టాండ‌ప్ రాహుల్‌`. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్‌. సాంటో మోహన్ వీరంకిని ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం చేస్తూ నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
ఇది జీవితంలో దేనికోసం క‌చ్చితంగా నిలబడని ఒక వ్య‌క్తి  నిజమైన ప్రేమను కనుగొని, తన తల్లి దండ్రుల కోసం, అతని ప్రేమ కోసం స్టాండ్-అప్ కామెడీ పట్ల ఉన్నత‌న‌ అభిరుచిని చాటుకునే  స్టాండ్-అప్ కామిక్ కథ. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ ప‌తాకాల‌పై  ఫీల్ గుడ్ రొమాన్స్ కామెడీ చిత్రంగా రూపొందుతోంది.
 
బుధ‌వారంనాడు వ‌ర్ష ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్‌. ఈ చిత్రంలో రాజ్‌త‌రుణ్ పోషిస్తున్న పాత్ర మాదిరిగానే వ‌ర్ష కూడా శ్రేయా రావు అనే స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌ రోల్ చేస్తుంది. డిఫ‌రెంట్ ఇమేజెస్‌తో ఉన్న వ‌ర్ష‌బొల్ల‌మ్మ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమాకు స్వీకర్ అగస్తి సంగీతం,  శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్ర‌ఫి నిర్వ‌హిస్తున్నారు.
వెన్నెల‌కిషోర్‌, ముర‌ళిశ‌ర్మ‌, ఇంద్ర‌జ‌, దేవీ ప్ర‌సాద్ మ‌రియు మ‌ధురిమ ఇతర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.
 
న‌టీన‌టులు:
రాజ్ త‌రుణ్‌, వ‌ర్ష‌బొల్ల‌మ్మ‌, వెన్నెల‌కిషోర్‌, ముర‌ళిశ‌ర్మ‌, ఇంద్ర‌జ‌, దేవీ ప్ర‌సాద్ మ‌రియు మ‌ధురిమ తదిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం -  స్వీకర్ అగస్తి, సినిమాటోగ్ర‌ఫి -   శ్రీరాజ్ రవీంద్రన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

Honour killing in Telangana: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. తెలంగాణలో పరువు హత్య

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

డబ్బు కోసం వేధింపులు.. ఆ వీడియోలున్నాయని బెదిరించారు.. దంపతుల ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments