Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి కాయల దుకాణం పెట్టిన హీరో నరేష్

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (15:04 IST)
అనేక మంది సినీ సెలెబ్రిటీలకు వ్యక్తిగతంగా పామ్‌హౌస్‌లు ఉన్నాయి. ఇక్కడ పండే పండ్లను తమ స్నేహితులు, బంధు మిత్రులకు పంపుతుంటారు. అలాంటి ఫాంహౌస్‌ను కలిగిన వారిలో సినీ నటుడు నరేష్ కూడా ఉన్నారు. 
 
తన ఫాంహౌస్ తోటలో పండించిన పండ్లను స్వయంగా అమ్మారు. లాక్డౌన్ సమయంలో వ్యవసాయంతో కాస్తంత టైంపాస్ చేసిన అతడు.. ఇప్పుడు ఫాంహౌస్‌లో తన చెట్లకు కాసిన పండ్లను తానే స్వయంగా కోశారు.  
 
ఆ మామిడి పండులు, నేరేడు పండ్లను ఆఫీసుకు తీసుకొచ్చి స్వయంగా విక్రయించారు. కిలో రూ.50 చొప్పున మొత్తం రూ.3,600 సంపాదించాడు. తన పండ్ల వ్యాపారం గురించి ఆయన ట్విట్టర్‌లో స్పందించారు.
 
సినీ నటుడిగా అత్యధిక పారితోషికం తీసుకున్నప్పుడు కలిగిన ఆనందం కన్నా.. ఇప్పుడు స్వయంగా వ్యవసాయం చేసి సంపాదించిన దాంతోనే ఎక్కువ ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. వ్యవసాయం చేయడంలోనే అసలైన మజా ఉందన్నారు. 
 
సేంద్రియ పద్ధతిలో తన ఫాంహౌస్‌లో పండించిన మామిడి, నేరేడు పండ్లను తానే స్వయంగా కోశాననీ, కిలో రూ.50కి అమ్మానని నరేశ్ చెప్పారు. ట్విట్టర్‌లో ఆయన పెట్టిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అలీతో కలిసి ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’ అనే సినిమాలో ఆయన నటిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments