Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ కథానాయ‌కుడు సెన్సార్ టాక్ ఏంటి..?

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (20:55 IST)
నంద‌మూరి తార‌క రామారావు జీవిత చ‌రిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్‌ను అందుకుంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఆయన తనయుడు నందమూరి బాలక్రిష్ణ లీడ్ రోల్‌లో క్రిష్ జగర్లమూడి ఈ చిత్రాన్ని రెండు పార్ట్‌లుగా రూపొందించారు. తొలి భాగాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేస్తున్నారు. 
 
ఈ చిత్రాన్ని చూసి సెన్సార్  సభ్యులు ఎటువంటి కట్స్ చెప్పకుండా క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారు. దీంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తుంది.  ఎన్టీఆర్‌ పాత్రలో బాల‌కృష్ణ అద్భుతంగా న‌టించార‌ని.. తెలుగు సినిమా చరిత్రలో ఇదో మరపురాని చిత్రంగా నిలిచిపోతుందని సెన్సార్ స‌భ్యులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించార‌ట‌. 
 
అచ్చుగుద్దినట్టుగా ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య ఒదిగిపోవడంతో పాటు.. బసవతారకంగా విద్యాబాలన్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, సావిత్రిగా నిత్యా మీనన్, హరిక్రిష్ణగా కళ్యాణ్ రామ్, నాగేశ్వరరావుగా సుమంత్, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి, ‘టైగర్’ హెచ్.ఎం.రెడ్డిగా కైకాల సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి పర్ఫెక్ట్‌గా సరిపోయారని తెలుస్తోంది. మ‌రి.. బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో..!

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments