Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిజం కక్కలేని బయోపిక్కులొద్దయా... వినరా మామా... నాగబాబు

Advertiesment
నిజం కక్కలేని బయోపిక్కులొద్దయా... వినరా మామా... నాగబాబు
, శుక్రవారం, 4 జనవరి 2019 (17:35 IST)
హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి హీరో బాలకృష్ణ ఓ సంద‌ర్భంలో పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని చెప్ప‌డం... ఈ వ్యాఖ్య‌ల‌కు స‌మాధానంగా మెగా సోదరుడు నాగ‌బాబు త‌న‌కు బాల‌కృష్ణ ఎవ‌రో తనకు తెలియదు అంటూ ఓ ఇంట‌ర్వ్యూలో కామెంట్ చేయ‌డం ఎంత వివాదానికి దారితీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. 
 
ఇందుకు బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైనప్పటికీ.. నాగబాబు కౌంటర్‌గా పాత నటుడు బాలయ్య ఫోటోను పోస్టు చేసి.. బాలయ్య ఎవరో తెలియకుండా వుంటుందా అంటూ సెటైర్ వేసిన సంగతి కూడా మరిచిపోలేము. ఈ నేపథ్యంలో తాజాగా నాగబాబు మరోసారి బాలయ్యపై సోషల్ మీడియా వ్యంగ్య కవితను పోస్టు చేశారు. తాజాగా బాలయ్య నటిస్తున్న.. ఎన్టీఆర్ బయోపిక్‌ను నాగబాబు టార్గెట్ చేశారు. 
 
బాలయ్య నటించే ఎన్టీఆర్ సినిమాపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కవిత్వం రూపంలో నాగబాబు చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాగబాబు రాసిన ఈ కవిత మెగా ఫ్యాన్స్‌కు తెగనచ్చేసింది. ఇంకా ఆ కవిత ఎలా వుందంటే.. 
 
"కట్టు కథలు కొన్ని..
కల్పనలు ఇంకొన్ని 
చుట్టనేల.. మూట కట్టనేల 
నిజం కక్కలేని బయోపిక్కులొద్దయా 
విశ్వదాభి రామ 
వినరా మామా.." అంటూ కవితను పోస్టు చేశారు. 
బ్రాకెట్లో కవిత్వాలు మాకూ వచ్చండోయ్ అనే క్యాప్షన్ పెట్టారు. 
webdunia
అంతేగాకుండా ఈ పోస్టులో స్టే ట్యూన్డ్ అని వ్యాఖ్యానించడం ద్వారా.. ఇకపైన కూడా ఇలాంటి సెటైర్లు వుంటాయని నాగబాబు హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఎలాంటి వివాదానికి దారితీస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్క భార్య, 11 మంది భర్తలు.... పీల్చేసింది... ఎలాగో తెలుసా?