Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఘ‌వ లారెన్స్ కాంచ‌న - 3 సెన్సార్ రిపోర్ట్ ఏంటి..?

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (16:40 IST)
ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2 తో హార్ర‌ర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే భారీ స‌క్స‌ెస్‌తో పాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘ‌వ లారెన్స్ హీరోగా, స్వీయ ద‌ర్శ‌కత్వంలో ముని సిరీస్ నుంచి వ‌స్తున్న హార్ర‌ర్ కామెడీ చిత్రం కాంచ‌న‌-3. రాఘ‌వ లారెన్స్ అందించిన హార్ర‌ర్ చిత్రాల‌న్నీ  సౌత్ ఇండియాలో బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా బాక్సాఫీస్‌ని షేక్ చేసిన‌వే. అన్నిటిని మించి ఈ కాంచ‌న‌-3 మాత్రం లారెన్స్‌కి స్పెష‌ల్ చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
 
U/A సర్టిఫికెట్‌తో సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకుంది. రాఘ‌వ లారెన్స్ ఏం చేసినా స్పెష‌ల్‌గా, సెన్సేషన్‌గా ఉంటుంది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్‌తో ఒక మాసివ్ వేవ్‌ని తీసుకొచ్చింది.. అటు సినీ ప్రేక్షకులు నుండి ఇటు సామాన్య ప్రేక్షకుడు నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత బి.మ‌ధు విడుదల చేయనున్నారు. రాఘ‌వేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్లో రాఘ‌వ నిర్మాణంలో ఈ సినిమా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుద‌ల చేయనున్నారు.
 
ఈ సంద‌ర్భంగా రాఘవ లారెన్స్ మాట్లాడుతూ…. కాంచన 3 చిత్రం నా కెరీర్‌కే ప్రత్యేకమైంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. కథ, కథనం, గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయి. గతంలో వచ్చిన కాంచన సిరీస్ చిత్రాలు ప్రేక్షకుల్ని బాగా ఎంటర్‌టైన్ చేశాయి. ఇప్పుడు వాటికి మించిన కథాబలంతో వస్తున్నాం. ఈ సినిమా కోసం ఎన్నడూ లేని విధంగా దాదాపు 220 రోజుల పాటు వర్క్ చేశాం. ప్రతీ చిన్న విషయాన్ని చాలా కేర్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ చేశాం.
 
ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ  ట్రైలర్‌తో అంచనాలు తారాస్థాయికి చేరాయి. తమన్ అద్భుతమైన రీ-రికార్డింగ్ వర్క్ చేస్తున్నాడు. ఇందులో నా గెటప్‌కు చాలా మంచి పేరొచ్చింది. నా లుక్ కోసం చాలా కేర్ తీసుకున్నాం. సెన్సార్ సభ్యులు మా చిత్రాన్ని మెచ్చుకున్నారు. యూ బై ఏ సర్టిఫికెట్‌తో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. తెలుగులో బి.మధు గారు విడుదల చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని అన్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments