Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ‌జిలీ సెన్సార్ రిపోర్ట్ ఏంటి..?(Video)

Advertiesment
మ‌జిలీ సెన్సార్ రిపోర్ట్ ఏంటి..?(Video)
, బుధవారం, 3 ఏప్రియల్ 2019 (18:50 IST)
అక్కినేని నాగ చైతన్య, సమంత అక్కినేని జంట‌గా న‌టించిన చిత్రం మజిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ వైవిధ్య‌మైన ప్రేమ‌క‌థా చిత్రం రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు. సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
 
సెన్సార్ రిపోర్ట్ ఏంటంటే... స‌మంత శ్రావ‌ణి పాత్ర‌లో అద్బుతంగా న‌టించింద‌ట‌. అలాగే పూర్ణ పాత్ర‌లో చైత‌న్య కూడా అద్భుతంగా న‌టించాడ‌ట‌. ప్ర‌తి సీన్ ఆడియ‌న్స్‌కి క‌నెక్ట్ అయ్యేలా డైరెక్ట‌ర్ ఎంతో శ్ర‌ద్ధ‌తో ప్రేమ‌తో ఈ సినిమాని తీసాడ‌ని ప్ర‌తి ఆడియ‌న్ ఫీల్ అయ్యేలా ఉంద‌ట‌. సెకండ్ హీరోయిన్ దివ్యాంశ కూడా పాత్ర‌కు త‌గ్గ‌ట్టు చాలా బాగా న‌టించారు. 
 
రావు ర‌మేష్‌, పోసాని పాత్ర‌ల ప‌రిధి మేర‌కు పూర్తి న్యాయం చేసారు. యూత్ కి బాగా క‌నెక్ట్ అయ్యే సినిమా అవుతుంది అని సెన్సార్ టాక్. ఎప్ప‌టి నుంచో చైత‌న్య భారీ విజ‌యం కోసం ఎదురుచూస్తున్నారు. మ‌రి... మ‌జిలీ అందిస్తుందేమో చూడాలి. వీడియో చూడండి...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనవడికి తాత ఇచ్చిన గిఫ్ట్‌కి షాకైన అల్లు అర్జున్