రెయిన్‌బో నది: ప్రపంచంలో ఇంత అందమైన నది మరొకటి లేదు..

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (15:48 IST)
దక్షిణ అమెరికా ఖండంలోని కొలంబియా దేశంలో ఉన్న ఈ నదిని ఖనిజాల గని అని పిలుస్తారు. ఈ నది రంగును చూసి పర్యాటకులు మంత్రముగ్ధులు అవుతుంటారు. ఆ ప్రాంతంలో మకరేనియా క్లేవిగెరా అనే నీటి మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. వీటి వల్లే ఆ నది రంగు అలా ఉంటుందని స్థానికంగా ఉండే టూరిస్ట్ గైడ్ ఒకరు అంటున్నారు. వివిధ రంగుల్లో పర్యాటకులకు కనువిందు చేస్తున్న ఈ నది పేరు 'కనో క్రిస్టాలీస్'. 'రెయిన్‌బో రివర్' అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతానికి లక్షల ఏళ్ల చరిత్ర ఉంది. దీనినే 'షీల్డ్ ఆఫ్ గయానా'గా అభివర్ణిస్తారు. 
 
ఈ నది రంగు గురించి అనేక వాదనలు ఉన్నాయి. రాళ్లలో ఖనిజాలు ఉండడం వల్ల ఆ రంగు వచ్చిందని కొందరు అంటారు. అంతేకాకుండా ఖనిజాలతో పాటు రాళ్లు కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగలేవని చెబుతున్నారు. ఈ మొక్కలు ఏడాదికి కేవలం ఒక సెంటీమీటర్ మాత్రమే పెరుగుతాయి. భూమిలోని ఖనిజాలకు అనుగుణంగా ఈ పూల రంగు ఉంటుంది.
 
అమెజాన్ అడవి, ఆండియన్ పర్వత శ్రేణులు, ఒరినోకియా మైదాన ప్రాంతం ఇక్కడే కలిసి ఉన్నాయి. నీటి మొక్కలు పెరిగే ఈ ప్రాంతంలో వేర్వేరు జోన్‌లు ఉన్నాయి. గతంలో ఈ నదిని ప్రమాదకరమైన ప్రాంతంగా భావించేవారు. ప్రస్తుతానికి మాత్రం దీనిని మరింత అభివృద్ధి చేసి, గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే బాగుంటుందని పర్యాటకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇక్కడే.. మీ కోసం ఎదురు చూస్తున్నా.. ట్రంప్‌‍కు కొలంబియా అధ్యక్షుడు సవాల్

పీడ విరగడైంది, తాగుబోతు భర్త వేధింపులు తట్టుకోలేక చంపేసిన భార్య

ట్రంప్‌ను వెక్కిరిస్తూ డాన్స్ చేసిన మదురో, అందుకే వెనెజులాపై దాడి చేసారా?

కరూర్ తొక్కిసలాట: టీవీకే చీఫ్ విజయ్‌కి సమన్లు జారీ చేసిన సీబీఐ

నోబెల్ గ్రహీత అమర్త్యసేన్‌కు 'సర్' నోటీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నూతన సంవత్సరం, నూతన అలవాట్లు: బరువు నియంత్రణలో కాలిఫోర్నియా బాదం కీలక పాత్ర

ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే రాగులతో చేసిన రొట్టెలు తినకుండా వుండరు

వాకింగ్ ఎలా చేస్తే ఆరోగ్యకరం?

2026 సంవత్సరానికి స్వాగతం పలికిన తలసేమియా- సికిల్ సెల్ సొసైటీ

Ginger Milk in winter అల్లం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments