Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒత్తిడి.. ఏడు రోజులు.. ఏడుగురు బాయ్‌ఫ్రెండ్స్.. చివరకు ఏమైందంటే?

ఒత్తిడి.. ఏడు రోజులు.. ఏడుగురు బాయ్‌ఫ్రెండ్స్.. చివరకు ఏమైందంటే?
, గురువారం, 4 ఏప్రియల్ 2019 (14:26 IST)
డిప్రెషన్ నుంచి బయటపడేందుకు ఓ మహిళ రెయిన్‌బో అంటూ ఒక సరికొత్త ప్రయోగానికి తెరతీసింది.. బాయ్ ఫ్రెండ్స్‌ను మార్చుతూ వరుసగా ఏడు రోజుల పాటు ఏడుగురితో డేటింగ్ ప్లాన్ చేసింది. ఒత్తిడి నుంచి ఉపశమనం లభించేందుకు అలా చేసానని చెప్పి సంచలనాలకు తెరతీసింది. ఈ మహిళ చెప్పిన అనుభవానికి మానసిక నిపుణులు సైతం విస్తుపోయారు. 
 
ఆస్ట్రేలియాకు చెందిన నదియా బొకోడీ ఏడేళ్ల పాటు సాగిన తన వివాహబంధం మనస్పర్థలతో విడాకుల దాకా వెళ్లడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఆ బాధ నుండి బయటపడేందుకు ఆమె ఓ వింత ప్రయోగం చేసింది. ఏడు రోజుల పాటు ఏడుగురు వేర్వేరు పురుషులతో వన్ నైట్ స్టాండ్స్ చేసినట్లు తెలిపింది. నదియా ఈ ప్రయోగానికి రెయిన్‌బో అని ముద్దుపేరు పెట్టుకుంది. తీవ్ర ఒత్తిడి నుంచి బయటపడేందుకు వరుసగా ఏడుగురు బాయ్‌ఫ్రెండ్స్‌తో వన్ నైట్ స్టాండ్స్ చేసినట్లు తెలిపింది.
 
ఒక్కో రోజు ఒక్కో బాయ్‌ఫ్రెండ్‌తో గడపడం సరికొత్త అనుభూతినిచ్చిందని, రెయిన్‌బో ప్రయోగం తన బాధను మరచిపోయేలా చేసిందని తెలిపింది. అంతే కాదు తన అనుభవాలను ఆస్ట్రేలియాకు చెందిన ఒక రేడియో ప్రోగ్రామ్‌లో పంచుకుంది. నదియా విడాకులు తీసుకున్న అనంతరం తాను మానసిక ఒత్తిళ్ల నుంచి దూరమయ్యేందుకు చికిత్స కూడా తీసుకున్నట్లు తెలిపింది. 
 
అయితే ఒక థెరపిస్ట్ ఇచ్చిన సలహా మేరకు రెయిన్‌బో ప్రయోగం చేసానని నదియా తెలిపింది. అంతే కాదు తనలాగే డిప్రెషన్‌తోనూ, పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడే వారి కోసం "కో డిపెండెంట్స్" పేరిట ఒక గ్రూపు స్టార్ట్ చేసి తన ప్రయోగంలో అనుభవాలను పంచుకున్నట్లు నదియా తెలిపింది.
 
రెయిన్‌బో ప్రయోగంలో మొదటి రోజు ఒక నైట్ క్లబ్‌లో టెడ్ అనే యువకడితో కలిసి డేటింగ్ మొదలు పెట్టినట్లు తెలిపింది. రెండో రోజు తన ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తోనూ, మూడో రోజు ఒక సైనికుడితోనూ, అలా.. తనకు స్నేహితులు, పరిచయం ఉన్న వారందరికీ సందేశాలు పంపి డేటింగ్ చేసినట్లు నదియా తెలిపింది. చివరి రోజు మాత్రం బెన్ అనే ఒక ఇంగ్లాండ్ వ్యక్తితో వన్ నైట్ స్టాండ్ చేయడంతో తన ఒత్తిడి పూర్తిగా తగ్గి, మానసికంగా ప్రశాంతత చేకూరినట్లు నదియా తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.24,490 కే పానాసోనిక్ ఇన్వ‌ర్ట‌ర్ ఏసీ..!