Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒకే ఆస్పత్రిలో పని చేసే 9 మంది నర్సులకు ఒకేసారి గర్భం... ఎలా?

Advertiesment
ఒకే ఆస్పత్రిలో పని చేసే 9 మంది నర్సులకు ఒకేసారి గర్భం... ఎలా?
, గురువారం, 4 ఏప్రియల్ 2019 (10:51 IST)
ఒకే ఆస్పత్రిలో పని చేసే 9 మంది నర్సులు ఒకేసారి గర్భందాల్చారు. వీరంతా ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో తల్లులు కాబోతున్నారు. ఈ అరుదైన ఘటన అమెరికాలోని మైనా రాష్ట్రంలో జరిగింది. స్థానికంగా ఉండే ఓ ఆస్పత్రిలో వీరంతా నర్సులుగా పని చేస్తున్నారు. ఈ విషయంపై ఆ ఆస్పత్రి యాజమాన్యం ఫేస్‌బుక్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. తమ ఆస్పత్రిలో పనిచేసే నర్సుల్లో 9 మంది నర్సులు ఒకేసారి గర్భందాల్చడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంటూ తల్లులు కాబోతున్న వారందరికీ అభినందనలు తెలిపింది. 
 
అయితే, వీరంతా ప్రసవించే తేదీలు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. ఈ గర్భందాల్చిన 9 మంది నర్సులతో ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. ఈ ఫోటో కింద పలువురు నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. డెలివరీ అయిన తర్వాత పిల్లలతో కూడా ఇలాంటి ఫొటో తీసి పెట్టాలంటూ కొందరు కోరారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీకాకుళం జిల్లా ఎన్నికల బరిలో 'బంధుగణం'