Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైరా వసీం లైంగిక వేధింపులు.. భర్తకు వత్తాసు పలికిన భార్య

'దంగల్' నటి జైరా వసీంను విమానంలో లైంగికంగా వేధించిన కేసులో ప్రధాన నిందితుడికి ఆయన భార్య నుంచి ఫుల్‌సపోర్టు లభించింది. తన భర్త చాలా బుద్ధిమంతుడని, పరాయి స్త్రీలను అమితంగా గౌరవిస్తాడంటూ చెప్పుకొచ్చింది.

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (10:32 IST)
'దంగల్' నటి జైరా వసీంను విమానంలో లైంగికంగా వేధించిన కేసులో ప్రధాన నిందితుడికి ఆయన భార్య నుంచి ఫుల్‌సపోర్టు లభించింది. తన భర్త చాలా బుద్ధిమంతుడని, పరాయి స్త్రీలను అమితంగా గౌరవిస్తాడంటూ చెప్పుకొచ్చింది.
 
నటి జైరా వసీం విస్తారా ఎయిర్‌లైన్స్‌ విమానంలో శనివారం రాత్రి ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తుండగా తోటి ప్రయాణికుడు అసభ్యంగా వర్తించిన విషయం తెల్సిందే. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆ నటి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇది వైరల్ కావడంతో సీరియస్ అయిన కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. అదేసమయంలో ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసిన పోలీసులు అసభ్య ప్రవర్తన అభియోగంపై వికాస్‌ సచిదేవ్‌(39) అనే ప్రయాణికుడిని అరెస్టు చేశారు. 
 
ఈ వ్యవహారంపై ఆయన స్పందిస్తూ, విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు జైరా వసీమ్‌కు తన కాలు అనుకోకుండా తగిలిందని, దీంతో తనపై ఆమె గట్టిగా అరవడంతో తాను క్షమాపణ కూడా చెప్పానని అతను తెలిపాడు. పైగా, ఢిల్లీలో బంధువు అంత్యక్రియలలో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఉన్న తనకు మనసు బాగా లేదని కూడా అతను పోలీసులకు వివరించాడు. అంత్యక్రియల్లో పాల్గొన్నందున ఎక్కువసేవు నిద్రకూడా పోలేదనీ అందువల్ల తనను లేపవద్దని క్యాబిన్‌ సిబ్బందికి చెప్పినట్లు సచిదేవ్‌ పోలీసులకు తెలిపాడు. 
 
ఈ ఘటనపై భర్తకు భార్య దివ్య కూడా వత్తాసు పలికింది. తన భర్త మానసిక స్థితి బాగో లేదని, డిప్రెషన్‌లో ఉన్నారని ఆమె చెప్పుకొచ్చింది. తన భర్త మావయ్య చనిపోయినందున ఆయన దిగులుతో ఉన్నారని దివ్య పోలీసులకు చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

జైళ్లలో ఏం జరుగుతోంది.. వైకాపా నేతలకు రాచమర్యాదలా? అధికారులపై సీఎం సీరియస్

రాత్రికి తీరందాటనున్న తుఫాను... ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం