Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లో మరో శాడిస్ట్ గే భర్త .. భార్యనుకాదనీ యువకులతో రాసలీలలు

ఇటీవల చిత్తూరులో వెలుగు చూసిన శాడిస్ట్ రాజేష్‌లాంటి ఉదంతం ఒకటి చిత్తూరులో వెలుగు చూసింది. అతనో గే అని తెలిసి కూడా తనకు వివాహం చేసి తన జీవితాన్ని నాశనం చేశారంటూ ఆ యువతి బోరున విలవిస్తోంది.

Advertiesment
Gay
, ఆదివారం, 10 డిశెంబరు 2017 (17:38 IST)
ఇటీవల చిత్తూరులో వెలుగు చూసిన శాడిస్ట్ రాజేష్‌లాంటి ఉదంతం ఒకటి చిత్తూరులో వెలుగు చూసింది. అతనో గే అని తెలిసి కూడా తనకు వివాహం చేసి తన జీవితాన్ని నాశనం చేశారంటూ ఆ యువతి బోరున విలవిస్తోంది. పూసల బస్తీకి చెందిన దీపిక వెల్లడించిన వివరాల మేరకు.. 
 
రంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన అంకుష్‌తో దీపికకు మూడేళ్ల కిందట వివాహమైంది. రెండేళ్లుగా నా భర్త ప్రవర్తనపై అనుమానం ఉంది. అతను ఎప్పుడు ఫోన్‌లో చాటింగ్ చేసేవాడు. నేను అమ్మాయితో మాట్లాడుతున్నాడని అనుకునేదాన్ని. ఫోన్ ఎవరికీ కనపడకుండా దాచేవాడు. తరుచూ బెంగళూరుకు పోతున్నానని చెప్పేవాడు. ఎక్కడికి వెళ్తున్నావని అంకుష్‌ను ప్రశ్నించకూడదు. ప్రశ్నించిన చావబాదేవాడు.
 
ఆరునెలలుగా అరుణ్ కార్తీక్ అనే అబ్బాయితో చాలా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కార్తీక్‌తోనే చాటింగ్ చేసేవాడు. అసభ్యకరమైన పదాలతో ఫోన్‌కు మెసేజ్‌లు వచ్చేవి. బాత్‌రూంలోకి ఫోన్‌ను తీసుకుని వెళ్లేవాడు. బాత్‌రూంలోకి ఎవరూ రాకుండా తలుపుకు గడియ పెట్టేవాడు. అంకుష్‌తో కలిసి వాళ్ల కుటుంబ సభ్యులు చిత్రహింసలు పెట్టారు. దీనిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ల వైపు నుంచి కూడా మద్దతు దొరకలేదు అని మీడియా ముందు వాపోయింది. దీపిక ఆరోపణలపై అంకుష్, అతని కుటుంబసభ్యులు స్పందించలేదు. కాగా, అంకుష్ జహీరాబాద్‌లోని అరుణ విద్యాసంస్థలకు యజమాని కావడం గమనార్హం. 
 
ఇదీ అసలు కథ... 
సైదాబాద్‌ పూసల బస్తీకి చెందిన హెచ్‌.దీపికతో జహిరాబాద్‌కు చెందిన అరుణ హైస్కూల్‌, అరుణబాయి డీఈడీ కళాశాల యాజమాని జి.అంకుష్‌తో గత 2014 మే 14వ తేదీన వివాహం జరిగింది. పెళైనా నాటి నుంచి అంకుష్‌ తన భార్యను దూరంగా ఉంచసాగాడు. అకారణంగా చిత్రహింసలకు గురిచేస్తూ వచ్చాడు. అయినా అతడి ప్రవర్తన మారి దగ్గరవుతాడని చాలాకాలంగా వేచి చూసింది. 
 
రోజులు గడిచేకొద్దీ అతనిలో మార్పురాకపోగా, మరింత వింతగా ప్రవర్తించసాగాడు. ఈ క్రమంలో నిత్యం బెడ్‌రూంలో లోపల నుంచి గడియపెట్టుకుని ఒంటరిగా ఉంటూ మోబైల్‌ ఫోన్‌లో లైవ్‌ వీడియా ద్వారా దుస్తులు విప్పదీసి యువకులతో గంటలకొద్ది చాటింగ్‌ చేస్తూ కాలక్షేపం చేయసాగాడు. పైగా, పలు ప్రాంతాల నుంచి తన ప్లాటుకు యువకులను రప్పించుకుని వారితో స్వలింగ సంపర్కం చేస్తూ ఎంజాయ్ చేయసాగాడు. 
 
దీంతో భర్త ప్రవర్తనపై కన్నేసిన భార్య, సెల్‌పోన్‌ లైవ్‌ వీడియాలో ఓ యువకుడితో సాగిస్తున్న చర్యలను కనిపెట్టి అత్తమామలకు చెప్పి భర్తను నిలదీసింది. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో మరింతగా రెచ్చిపోవడమే కాకుండా భార్యపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి అర్థరాత్రిపూట ఔటర్‌రింగ్‌ రోడ్డులో ఒంటరిగా వదిలి వెళ్లాడు. 
 
అక్కడ నుంచి ఆమె ఎలాగోలా సైదాబాద్‌లోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరింది. తన కుటుంబసభ్యుల సాయంతో శనివారం సైదాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని, అతడి కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరుగుదొడ్డి నిర్మించాలంటే కోరిక తీర్చాలట.. ఎక్కడ?