Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెర్రీ ఎవడు స్ఫూరితో భర్తను హతమార్చిన భార్య.. ఎలాగంటే?

టీవీ సీరియల్స్ చూస్తూ ఓ మహిళకు పైత్యం తలకెక్కింది. ఒంటరితనం ఆమెకు భారంగా మారింది. దీనికి తోడు వ్యాపారాల కోసం భర్త అప్పుడప్పుడు విదేశాలకు వెళ్లడంతో విసుగు చెందిన మహిళ.. తనకు దగ్గరైన కుర్ర డాక్టర్‌పై మో

Advertiesment
చెర్రీ ఎవడు స్ఫూరితో భర్తను హతమార్చిన భార్య.. ఎలాగంటే?
, సోమవారం, 11 డిశెంబరు 2017 (10:23 IST)
టీవీ సీరియల్స్ చూస్తూ ఓ మహిళకు పైత్యం తలకెక్కింది. ఒంటరితనం ఆమెకు భారంగా మారింది. దీనికి తోడు వ్యాపారాల కోసం భర్త అప్పుడప్పుడు విదేశాలకు వెళ్లడంతో విసుగు చెందిన మహిళ.. తనకు దగ్గరైన కుర్ర డాక్టర్‌పై మోజు పెంచుకుంది. అంతేగాకుండా భర్తను హతమార్చాలని ప్లాన్ చేసి జైలు పాలైంది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూలుకు చెందిన మంద స్వాతికి.. యంగ్ డాక్టర్ రాజేష్ దగ్గరయ్యాడు. 
 
ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో స్వాతి భర్త సుధాకర్‌కు ఆ విషయం తెలియవచ్చింది. దీంతో భార్యాభర్తలకు మధ్య గొడవలు ప్రారంభమైనాయి. ఈ గొడవలు కొట్టుకునే స్థాయికి చేరింది. ఓసారి భార్యాభర్తల మధ్య జరిగిన దాడిలో సుధాకర్ తలకు గాయం కాగా సుధాకర్ ఆస్పత్రి పాలయ్యాడు. 
 
ఆపై స్వాతి, రాజేష్ కలిసి సుధాకర్‌కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి.. తలపై ఇనుపరాడ్డుతో కొట్టి హతమార్చారు. ఆపై శవాన్ని దహనం చేశారు. పైగా సీరియల్ ఫక్కీలో యాసిడ్ దాడి డ్రామాకు తెరలేపారు. డ్రామా ఎలా జరిగిందంటే.. భర్తను హతమార్చిన స్వాతి.. అతని పోలికలే వున్న రాజేష్‌ను రంగంలోకి దించింది. అతడి ముఖంపై యాసిడ్ దాడి జరిగిందని రాజేషే సుధాకర్ అని నమ్మించింది. 
 
యాసిడ్ దాడిలో అతని ముఖం ఇలా మారిందని కథలు చెప్పింది. కానీ సుధాకర్‌లా నటిస్తున్న రాజేష్ తమ బిడ్డ కాదని వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో సుధాకర్‌ను హతమార్చిన మాట నిజమేనని రాజేష్, స్వాతి ఒప్పుకోవడంతో వారికి పోలీసులు జైలుకు తరలించారు. రామ్ చరణ్ ఎవడు సినిమా స్ఫూర్తితో ఈ హత్య జరిగిందని.. ఆ చిత్రంలో ఓ మహిళ భర్తను హతమార్చిందని పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ప్రసవ' ఫోటోను ఫేస్‌బుక్‌లో పెట్టిన తైవాన్ మహిళ