తప్పు చేస్తే సారీ చెప్పాలి.. తప్పు చేయకుంటే క్షమాపణ చెప్పను : కమల్ హాసన్

ఠాగూర్
శుక్రవారం, 30 మే 2025 (16:01 IST)
ఏదైనా విషయంలో తప్పు చేస్తే సారీ చెప్పాలని, తప్పు చేయనపుడు క్షమాపణ చెప్పనని, ఇది తన పద్దతి అని అగ్ర నటుడు కమల్ హాసన్ అన్నారు. కన్నడం తమిళ భాష నుంచి పుట్టిందంటూ తాను చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం తప్పులేదన్నారు. అందువల్ల సారీ చెప్పే ప్రసక్తే లేదన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం "థగ్ లైఫ్". ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. ఈ వివాదంపై ఆయన మరోమారు స్పందించారు.
 
"నేను ఏదైనా విషయంలో తప్పుచేస్తే ఖచ్చితంగా సారీ చెబుతాను. తప్పు చేయనపుడు క్షమాపణ చెప్పను. ఇది నా పద్దతి. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. నేను చట్టాన్ని, న్యాయాన్ని పూర్తిగా నమ్ముతాను, గౌరవిస్తాను" అని కమల్ హాసన్ అన్నారు. ఈ విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. 
 
కాగా, తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందంటూ కమల్ చేసిన వ్యాఖ్యలపై కర్నాటక రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ రాష్ట్రంలోని అధికార, విపక్ష పార్టీలకు చెందిన నేతలు కమల్ హాసన్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే, కర్నాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఈ విషయంలో తీవ్రంగా స్పందించింది. మే 30వ తేదీలోపు కమల్ హాసన్ సారీ చెప్పకపోతే ఆయన నటించిన "థగ్ లైఫ్" చిత్ర విడుదలను అడ్డుకుంటామని కేఎఫ్సీసీ హెచ్చరికలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

Sathya Sai Baba: సత్యసాయి బాబా సేవ, కరుణ మూర్తీభవించిన వ్యక్తి.. బాబు

అంగారక గ్రహంపై బండరాయిని గుర్తించిన నాసా.. అందులో ఇనుము, నికెల్ మూలకాలు

స్టేజ్‌పై డ్యాన్సర్ పట్ల అసభ్య ప్రవర్తన.. నో చెప్పిన డ్యాన్సర్‌పై కర్రలతో దాడి...

Jagan mohan Reddy: ఈ నెల 20న నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments