Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్జియాలో "అఖండ-2" మూవీ షూటింగ్

ఠాగూర్
శుక్రవారం, 30 మే 2025 (15:01 IST)
నందమూరి బాలకృష్ణ - దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో "అఖండ-2" చిత్రం షూటింగ్ జార్జియాలో జరుపుకోనుంది. ప్రస్తుతం శరవేగంగా మూవీ షూటింగ్ సాగుతోంది. ఇప్పటికే మహాకుంభమేళాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. తాజాగా కీలక షెడ్యూల్ కోసం జార్జియాకు చిత్రబృందం చేరుకుంది. అక్కడ షూటింగ్‌ లొకేషన్‌కు సంబంధించిన వీడియో ఒకటి లీక్ అయింది. 
 
తాజాగా ఈ సినిమాలో కీలక షెడ్యూల్ కోసం చిత్రం యూనిట్ జార్జియా వెళ్లింది. అక్కడ సుందరమైన ప్రదేశాలలో సినిమా షూటింగ్ జరగనుంది. ఇందులోభాగంగా, బాలయ్య భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ షెడ్యూల్‌లో విదేశీ ఫైటర్స్ కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది. 
 
అయితే, జార్జియాలో "అఖండ-2" షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీ అచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ బాణీలు అందిస్తున్నారు. 
 
బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నటుడు ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీని దసరా కానుకగా సెప్టెంబరు 25వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కాగా, బాలయ్య, బోయపాటి కాంబోలో 'సింహా', 'లెజెండ్', 'అఖండ' వంటి హ్యాట్రిక్ హిట్స్ ఉండటంతో అఖండ-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments