Webdunia - Bharat's app for daily news and videos

Install App

జక్కన్నకు బండి సంజయ్ సూటి ప్రశ్న, రాజమౌళి సమాధానం చెబుతాడా?

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (19:15 IST)
ఆర్ఆర్ఆర్... సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఇది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ మూవీని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. చరణ్ పాత్రకు సంబంధించి టీజర్ రిలీజ్ చేసారు. మంచి స్పందన లభించింది. దీంతో తారక్ అభిమానులు ఎప్పటి నుంచో వీడియో కోసం ఎదురుచూస్తున్నారు.
 
రీసెంట్‌గా తారక్ పాత్రకు సంబంధించి టీజర్ రిలీజ్ చేసారు. అయితే... ఈ టీజర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. కానీ టీజర్ చివరిలో కొమరం భీమ్ పాత్ర పోషించిన తారక్ ముస్లింల వలే టోపీ పెట్టుకోవడం వివాదస్పదం అయ్యింది.
 
 అయితే.. ఈ వివాదాన్ని తెలంగాణ బీజేపీ మరింతగా సీరియస్‌గా తీసుకున్నట్టుంది. గత వారం రోజులుగా బీజేపీకి చెందిన నాయకులు ఈ టీజర్ గురించి బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు.
 
తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్యకుడు బండి సంజయ్ ట్వీట్స్ చేసారు. రాజమౌళిని సూటిగా ప్రశ్నించారు. ఇంతకీ ఏమని ప్రశ్నించారంటే...  హిందువులైన ఆదివాసుల ఆత్మగౌరవం కొమురం భీంకు రాజమౌళి గారి సినిమాలో టోపీ పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇది ఆదివాసుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. ఆదివాసుల దైవం కొమురం భీంకు టోపీ పెట్టేవారికి నిజాం ఫొటోకు కానీ, ఒవైసీకి గాని బొట్టు పెట్టి కాషాయ కండువా వేసే దమ్ముందా?,” అంటూ బండి సంజయ్ తన ట్వీట్లో క్వశ్చన్ చేశారు.
 
ఐతే ఈ సినిమాకి గాని, ఇందులో నటిస్తున్న ఎన్టీఆర్‌కి, రామ్ చరణ్‌కి తాము వ్యతిరేకం కాదని క్లారిటీ ఇచ్చారు బండి సంజయ్. ఆ సీన్లపైనే తమ అభ్యంతరం అంటున్నారు. “ఈ సినిమాలో నటించే జూ.ఎన్టీఆర్ గారికి గాని, రామ్ చరణ్ గారికి గాని ఇతర నటీనటులకు మేము వ్యతిరేకం కాదు. వారిని గౌరవిస్తాం. అది మా సంస్కారం. హిందువుల మనోభావాలతో చెలగాటం ఆడితే మాత్రం దాన్ని సహించం. ఈమధ్య హిందువుల మనోభావాలతో ఆడుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారింది. దాన్ని అందరం కలిసి అడ్డుకోవాల్సిందే, అన్నారు. మరి... రాజమౌళి స్పందిస్తారో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments