Webdunia - Bharat's app for daily news and videos

Install App

సత్యదేవ్ సినిమా ఆగిపోయిందా? తమన్నా అందుకు కారణమా?

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (19:09 IST)
ఇప్పుడున్న యంగ్ యాక్టర్స్ లో ఏ పాత్ర అయినా పర్ఫెక్ట్ అనేలా చేస్తున్నాడు అని పేరు తెచ్చుకున్నారు సత్యదేవ్. ఇటీవల ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాకుండా... కరోనా కారణంగా సినిమా హాల్స్ మూసేయడంతో ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేసారు. ఓటీటీలో  రిలీజ్ చేసేందుకు సినిమా తీయాలంటే ఫస్ట్ ఆప్షన్ సత్యదేవే అయ్యాడు.
 
ఇదిలా ఉంటే... విభిన్న కథా చిత్రాలతో ఆకట్టుకున్న సత్యదేవ్, తమన్నా జంటగా గుర్తుందా శీతాకాలం అనే సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా కన్నడలో విజయం సాధించిన సినిమాకి రీమేక్. త్వరలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే... ఈ మూవీ ఆగింది అంటూ వార్తలు వచ్చాయి. గుర్తుందా శీతాకాలం... టైటిల్ బాగుంది. సత్యదేవ్‌కి మరో సక్సస్‌ఫుల్ మూవీ అవుతుంది అనుకుంటే ఇలా ఆగిపోవడం ఏంటి..? దీనికి కారణం సత్యదేవ్ ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడమే అంటూ టాలీవుడ్లో టాక్ వినిపించింది. 
 
మరో వార్త ఏంటంటే... త‌మన్నా ఈ సినిమా నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌డం వ‌ల్ల‌ ఈసినిమా ఆగిపోయింద‌ని గుస‌గుస‌లు వినిపించాయి. తాజా వార్త ఏంటంటే... ఈ సినిమా ఆగిపోలేదు. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని చెప్పకనే చెబుతూ... ఈ మూవీ ఆడిష‌న్స్ కోసం ఎనౌన్స్మెంట్ ఇచ్చింది. హీరో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో పాత్ర కోసం 12 నుంచి 15 ఏళ్ల‌లోపు అబ్బాయి కావాల‌ని ప్ర‌క‌టించింది. సో.. ఈ మూవీ ఆగలేదు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments