కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

దేవీ
శుక్రవారం, 16 మే 2025 (18:26 IST)
Krishna leela team with Vinayak
సూపర్ నేచురల్ లవ్ స్టొరీ 'కృష్ణ లీల'. 'తిరిగొచ్చిన కాలం'అనేది ట్యాగ్ లైన్. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్ పై  జ్యోత్స్న జి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ & మాటలు- అనిల్ కిరణ్ కుమార్ జి అందించారు. ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.
 
తాజాగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అందరికీ కాలం తిరిగివస్తుంది అంటూ హ్యాపీనెస్ తో దీవించారు. 'ప్రేమించడం, ప్రేమించబడడం.. రెండు కర్మలే. ఈ ప్రేమని అనైతికంగా అనుభవించాలనుకున్నా, అవాయిడ్ చేయాలనుకున్న, అది మరింత కాంప్లికెటెడ్ అయి, ఎన్ని జన్మలైనా నీకు సరైన పాఠం నేర్పే వరకు వదలదు''అనే పవర్ ఫుల్ వాయిస్ తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.
 
టీజర్ లో దేవన్ క్యారెక్టర్ వేరియేషన్స్, డిఫరెంట్ టైం లైన్స్, మిస్టీరియస్ కథనం.. సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచాయి. నెవర్ బిఫోర్ లవ్ స్టొరీతో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారని టీజర్ చూస్తే అర్ధమౌతోంది.
 
దర్శకుడిగా దేవన్ సరికొత్త పంధాలో ఈ ప్రేమ కథని ప్రెజెంట్ చేస్తున్నారని టీజర్ ప్రామిస్ చేస్తోంది. ధన్య బాలకృష్ణన్ తో పాటు వినోద్ కుమార్, యానిమల్ పృధ్వి, రవి కాలే కీలక పాత్రల్లో కనిపించారు. భీమ్స్ సిసిరోలియా బీజీఎం, సతీష్ ముత్యాల కెమరా వర్క్ టీజర్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది. ప్రొడక్షన్  వాల్యూస్  రిచ్ గా వున్నాయి. మొత్తానికి ఈ టీజర్ సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Komatireddy: ఏపీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పవన్ కల్యాణ్‌తో భేటీ అవుతారా?

ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రక్షణ తయారీ కేంద్రాలు

ఢిల్లీ వాయుకాలుష్యంతో చిన్నారులు చనిపోతున్నారు ... సోనియా ఆందోళన

Drones: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మందుల సరఫరాకు రంగంలోకి డ్రోన్‌లు

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ - అమ్మకానికి పెట్టిన పాక్ పాలకులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments