Webdunia - Bharat's app for daily news and videos

Install App

2022 సంవత్సరం, ఆగస్టు 7వ తేదీ, ఉదయం 7 గంటలకు పాపకు జన్మనిస్తా-సమంత

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2019 (12:51 IST)
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా తన సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో మాట్లాడింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమంత సెటైరికల్ సమాధానం ఇచ్చింది. 
 
సమంత మీరెప్పుడు తల్లికాబోతున్నారనే ప్రశ్నకు సమంత సమాధానమిస్తూ.. 2022 సంవత్సరం, ఆగస్టు 7వ తేదీ, ఉదయం 7 గంటలకు ఓ పాపకు జన్మనిస్తానని చెప్పింది. అంతేకాకుండా ఆ వీడియోను కూడా సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
కాగా, సమంత అక్కినేని తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసింది. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. పెళ్లికి ముందు తర్వాత హీరోయిన్‌గా సమంత ఓ వెలుగు వెలుగుతోంది. ఈ ఏడాది భర్త నాగ చైతన్యతో కలిసి చేసిన ‘మజిలీ’ ఆ తర్వాత సోలో లీడ్‌గా వచ్చిన కొరియన్ రీమేక్‌ ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబట్టి అదరగొట్టింది. 
 
సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ హిట్ సినిమా '96' రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తైంది.  సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments