Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్వాలా గుప్త తరహాలో తెలుగు సినిమాలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ వుంటుందా

దేవీ
శనివారం, 15 మార్చి 2025 (13:29 IST)
David Warner
క్రికెట్ ప్లే గ్రౌండ్ లో మెరిసిన  ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాలో నటించారు. ఈ విషయాన్ని ఇంతకుముందు దర్శకుడు ప్రకటించారు. నేడు ఆయనకు చెందిన ఫొటోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన చిత్రమే “రాబిన్ హుడ్”. ఇందులో డేవిడ్ వార్నర్ నటించారు. మరి ఆయన పాత్ర ఏమిటి? అనేది విశీదకరించలేదు. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది సినిమా. రిలీజ్ కుముందు ఆయన పాత్ర గురించి చెబుతారో చూడాలి.
 
ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పై క్రికెట్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వార్నర్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు జెర్సీ కలర్ ఆరెంజ్ రంగులో డిజైన్ చేయడం విశేషం. కథపరంగా డేవిడ్ ను తీసుకున్నట్లు దర్శకుడు తెలియజేస్తున్నాడు. గతంలో క్రికెట్ గురించి సినిమాలు వచ్చాయి. కానీ ఇలా ఓ క్రికెటర్ తెలుగు సినిమాలో నటించడం ప్రత్యేకం. ఒకరకంగా యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నంకూడా కావచ్చుని తెలుస్తోంది. ఇంతకుముందు టెన్నిస్ క్రీడాకారణి  జ్వాలా గుప్త కూడా మంచు విష్ణు సినిమాలో ఓ సాంగ్ లో నటించింది. కాగా, ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments