Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Samantha: రికార్డింగ్ డాన్స్ లా ఐటెం సాంగ్స్- బ్యాన్ చేయాల్సిన అవసరం వుందా?

Advertiesment
Items songs

దేవీ

, గురువారం, 13 మార్చి 2025 (12:55 IST)
Items songs
ఒకప్పుడు రంగస్థలంలో రికార్డింగ్ డాన్స్ లు వుండేవి. ఏదైనా పండుగకో, సందర్భంగానే ఊళ్ళలో కొంతమంది కళాకారులను తీసుకుని వచ్చి డాన్స్ లు వేయించేవారు. వారిని కొన్నిచోట్ల దొమ్మరి డాన్స్ లు అని పిలిచేవారు. రానురాను వెండితెర వచ్చాక ఆ డాన్స్ లు క్లబ్ డాన్స్ లు మారిపోయాయి. వాటిని కొందరు మాత్రమే డాన్స్ లు వేసేవారు. ఇక రానురాను మరింతగా పాశ్చాత్య పోకడ పెరిగిపోయి హీరోయిన్లే బిత్తిరి డాన్స్ లు వేసేస్తున్నారు.

అందులో దర్శకనిర్మాతలు, హీరోలు కూడా ప్రమేయం వుంది. ఆమధ్య సుకుమార్ సినిమా పుష్పలో సమంతచేత ఊ..అంటావా.. అంటూ ఐటెం సాంగ్ చేయించారు. అదేమిటంటే.. ఇది ఐటం సాంగ్ కాదు. ప్రత్యేక గీతం అంటూ దర్శకుడు తనదైన శైలిలో చెప్పాడు.
 
ఇప్పుడు రానురాను మరింతగా డాన్స్ లు ఎక్కువయ్యాయి. కేవలం యువతను ఆకట్టుకునేందుకు అని వారు చెబుతున్నా. అసలు ఇలాంటి వాటికి సరైన సెన్సార్ షిప్ లేకపోవడమే ప్రధాన లోపంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమాలలో మంచి, చెడు వుంటాయి. చెడునే ఎక్కుగా హైలైట్ చేస్తూ పిసరంత నీతిని చెప్పి తమది సందేశాత్మక చిత్రంగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. 
 
ఆ మధ్య విడుదలైన రవితేజ సినిమాలో రవితేజతో హీరోయిర్ బ్యాక్ పాకెట్లలో చేతులు పెట్టి మరీ డాన్స్ వేశారు. అందుకు ప్రత్యేకమైన పాకెట్ వున్న దుస్తలు కుట్టారు. దానిని దర్శక నిర్మాతలు సమర్థించుకున్నారు. ఇక ఎం.ఎల్.ఎ.గా వున్న టాప్ హీరో బాలక్రిష్ణ కూడా ఢాకు మహారాజ్ సినిమాలో  ఊర్వశి రౌతుల పిరుదులపై కొడుతూ పాట పడతారు. అది సినిమాలోనే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అయినా  ఆ పాటను బయట వివిధ ఫంక్షన్లలో కూడా ప్లే చేసి డాన్స్ చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో ఓ చోట ఇలా చేస్తే వెంటనే ఆ పాటను ఆపేసి, సంగీత కచేరి చేసినవారికి అక్కడి పెద్దలు గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. 
 
ఇక తాజాగా, శేఖర్ మాస్టర్ నాయిక కేతికశర్మలో లంగాను విప్పుతూ, లూజ్ చేస్తూ పాట బయటకు రాగానే ముందుగా సోషల్ మీడియాలో నెగెటివ్ గా కామెంట్లు వచ్చాయి. వెగటు ప్టెప్పలేంటిరా.. అంటున్న ప్రజలు ఫిక్సయి పోయారు. దీనిని చాంబర్ ద్రుష్టికి కొందరు తీసుకెళ్ళారు. అయితే అది తమ చేతుల్లో లేదనీ, సినిమా తీసేటప్పుడే సెన్సార్ నుంచి కొన్ని నిబంధనలు పెట్టాల్సిన అవసరం వుందని ఛాంబర్ అధ్యక్షుడు తెలియజేయడం విశేషం.

కాగా, ఈ డాన్స్ లపై ఎప్.డి.ఎసి. ఛైర్మన్ గా దిల్ రాజుకు ప్రశ్న ఎదురైంది. త్వరలో దీనిపై మాట్లాడతాను అని చెప్పడం విశేషం. ఇలాంటి పాటలతో సభ్య సమాజానికి ఏమి చెప్పదలచుకున్నారో ఏమోకానీ, తెలుగుజాతికి తలవంపులు తెచ్చేవిగా వున్నాయని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇలాంటి పాటలను బ్యాన్ చేయాల్సిన అవసరం వుందని అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నితిన్ అడిగిన ప్రశ్నలకు వెంకికుడుముల హానెస్ట్ సమాధానాలు