Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

Advertiesment
Ketika Sharma

దేవి

, సోమవారం, 10 మార్చి 2025 (18:33 IST)
Ketika Sharma
వెంకీ కుడుముల దర్శకత్వంలో హీరో నితిన్ నటించిన  రాబిన్ హుడ్ చిత్రం నుంచి మూడవ సింగిల్  "అది ధ సర్ప్రైజ్" ను విడుదల చేశారు. మొదటి రెండు పాటలు బ్లాక్ బస్టర్స్ అయిన తర్వాత ఈ పాటను ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించింది.
 
టైటిల్ కి తగినట్లుగా, ఈ పాట కేతిక శర్మ పాత్ర చుట్టూ ఉన్న ఆశ్చర్యకరమైన హాస్యభరితమైన సంఘటనల శ్రేణిని ప్రదర్శిస్తుంది.జివి ప్రకాష్ కుమార్  బీట్‌లతో కూడిన హై-ఎనర్జీ మాస్ పాటను అందించారు మరియు వీణ, నాదస్వరం జోడించడం వలన దానికి ప్రత్యేకమైన, క్లాసీ టచ్ వచ్చింది.
 
ఈ ప్రత్యేక పాటలో కేతికా శర్మ తన అద్భుతమైన జాస్మిన్ బ్లౌజ్, ఎనర్జిటిక్ డాన్స్ మూవ్స్ తో తన గ్లామర్ ని జోడించి, పాటను విజువల్ ట్రీట్‌గా మార్చింది. సోషల్ మీడియా లో ఇన్స్టంట్ హిట్ గా నిలిచిన ఈ పాట థియేటర్స్ లో ప్రేక్షకులను డాన్స్ చేపించడం పక్కాగా కనిపిస్తుంది.
 
నీతి మోహన్,  అనురాగ్ కులకర్ణి తమ అద్భుతమైన గాత్రాలతో ఈ పాటకు ప్రాణం పోశారు, అకాడమీ అవార్డు గ్రహీత చంద్రబోస్ రాసినసాహిత్యం పాటకు అదనపు ఆకర్షణగా నిలిచింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ పాట వైబ్ కి తగ్గట్టు మంచి ఎనర్జిటిక్ గా ఉంది.  "అది ధ సర్ప్రైజ్"   నిస్సందేహంగా ఈ సంవత్సరం అత్యంత హాటెస్ట్ పాటలలో ఒకటిగా తన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ పాటలో చివరి విజువల్స్‌లో నితిన్ మరియు శ్రీలీల కలిసి చేసిన డాన్స్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్ళింది.
 
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన రాబిన్‌హుడ్ మార్చి 28న పెద్ద తెరపైకి రానుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, కోటి ఎడిటర్. రాం కుమార్ ఆర్ట్ డైరెక్టర్.
 
తారాగణం: నితిన్, శ్రీలీల, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది