Vinay Kumar, Sravani Majjari
వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను సింగార క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. సింగార మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. పొయెటిక్ ఫిల్మ్ "కాలమేగా కరిగింది" ఈ నెల 21న ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్, 'ఊహలోన ఊసులాడే..' పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆర్టిస్టిక్ వ్యాల్యూస్ ఉన్న లవ్ స్టోరీగా "కాలమేగా కరిగింది" సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని మూవీ మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.