'జాను'ని బయటైతే చూస్తున్నారు కానీ థియేటర్లలో చూడలేకపోతున్నారా? ఎందుకని?

Webdunia
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (20:13 IST)
సమంత-శర్వానంద్ నటించిన జాను చిత్రం ఓహో... ఆహో అంటూ రివ్యూలు రాసినా జనం థియేటర్లకు పెద్దగా రావడం లేదు. దీనితో బాక్సాఫీస్ వద్ద ఇది కుప్పకూలింది. ఐతే జాను ప్రి-రిలీజ్, థ్యాంక్స్ మీట్ ఏది ఏర్పాటు చేసినా అక్కడికి మాత్రం కుప్పలుతెప్పలుగా అభిమానులు వస్తున్నారు. కానీ జాను చిత్రానికి ఆ రద్దీ వుండటంలేదు.
 
అసలు జాను చిత్రం ఎందుకలా అయ్యింది. తమిళంలో త్రిష-విజయ్ సేతు నటించిన 96 చిత్రానికి ఇది రీమేక్. ఈ 96 చిత్రాన్ని తమిళం అర్థం కాకపోయినా చాలామంది తెలుగువారు చూసేశారు. కాబట్టి స్టోరీ లైన్ ఏమిటో తెలిసిపోయింది. మళ్లీ ప్రత్యేకంగా చూడాలి అనుకుంటే ఏదో సమంత యాక్టింగ్ కోసమో, శర్వానంద్ యాక్టింగ్ కోసమో రావాలి. అలా వస్తున్నవారు కొద్దిమంది వుంటున్నారు. అందువల్ల థియేటర్ల వద్ద అనుకున్న రద్దీ కనబడటంలేదు. 
 
ఇకపోతే జాను విడుదలై వారంతంలో రూ. 6.5 కోట్లు రాబట్టింది. ఐతే ఈ చిత్రాన్ని రూ. 21 కోట్లకు పంపిణీ చేసినట్లు టాలీవుడ్ న్యూస్. అదే నిజమైతే మరో 15 కోట్లకు పైగానే రాబట్టాలి. జానుకి అంత సీనుందా అనేదే ఇప్పుడు టాక్. మరోవైపు దిల్ రాజు కూడా తను నెంబర్లు గురించి ఆలోచన చేయలేదని చెప్పేశారు. కాబట్టి జాను బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాగా మిగిలిపోతుందా లేదంటే అంచనాలను తలకిందులు చేసి భారీ వసూళ్లను రాబడుతుందా... వెయిట్ అండ్ సీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

పెళ్లి వేడుకకు వేదికైన ఐసీయూ వార్డు... ఎక్కడ?

ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచిన గంజాయి బానిస, ఎక్కడ?

దుబాయ్ ఎయిర్‌షోలో ప్రమాదం... కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments