సమంత అలా చేయొద్దంటూ దణ్ణం పెడుతున్న అభిమానులు.. ఏమైంది? (video)

గురువారం, 6 ఫిబ్రవరి 2020 (15:04 IST)
జాను సమంత కోసం వర్షంలో అభిమానులు
ఏమాయ చేశావేతో అందరిని మాయ చేసింది సమంత. ఆ సినిమా నుండి వెనక్కి తిరిగి చూడనేలేదు. తెలుగులో ఆమెతో నటించిన మొదటి హీరో నాగచైతన్యనే పెళ్లి చేసుకొని అక్కినేని కోడలుగా మారింది. పెళ్లి తర్వాత చాల స్లోగా సినిమాలను ఎంచుకుంటోంది సమంత. 
 
జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సమంత. తమిళంలో సూపర్ హిట్ అయిన 96 చిత్రానికి రీమేక్‌గా తెలుగులో రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం హీరో శర్వా, సమంతలు చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. అయితే గ్యాప్ దొరికితే చాలు సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా వుంటోంది. తనకు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌‌లలో అకౌంట్‌లు ఉన్నాయి. 
 
తెలుగులో టాప్ హీరోలకు కూడా లేనంత ఫాలోయింగ్ ట్విట్టర్‌లో సమంతకు ఉంది. తాజాగా ఈ భామ హాటెస్ట్ శారీలో హాఫ్ జాకెట్ వేసుకొని రచ్చ చేయడం మొదలు పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ట్విట్టర్లో వైరల్‌గా మారుతున్నాయి. సమంత ఇలాంటివి చేయొద్దంటూ కొంతమంది అభిమానులు సందేశాలను పంపుతుంటే.. హాట్ సమంత అంటూ మరికొంతమంది ఫోటోలను చూసి ఎంజాయ్ చేస్తున్నారట.
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 'వకీల్ సాబ్‌'గా పవన్ కళ్యాణ్.. టైటిల్ ఖరారు