Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇల్లు ఎలా వుండాలో చూసుకోండి

Advertiesment
house looks
ఎలాగూ ఇల్లు కడుతాం. కాస్త వాస్తును చూసి కట్టుకుంటే అంతా బాగుంటుంది. ఎలాగ వుండాలో ఒకసారి చూద్దాం.
 
1. సింహద్వారం ఎదురుగా మెట్లు మొదలవ్వడమన్నది మంచిది కాదు.
 
2. తలుపులు కుడివైపుకు తెరుచుకోవాలి.
 
3. రూమ్ సీలింగ్‌లో అయిదు కార్నర్‌లు వుండడం ఏమాత్రం మంచిది కాదు.
 
4. వాయువ్యం గెస్ట్‌రూమ్‌కి మంచిది.
 
6. ఈశాన్యంలో మెట్లు వుండరాదు.
 
7. రెండు ద్వారాలు ఎదురెదురుగా వున్నప్పుడు వాటి పారులు సరిపోయేటట్లు వుండవలెను.
 
8. త్రికోణపు లేదా 'U' ఆకారంగల ఇండ్లు ఏ మాత్రం మంచివి కావు.
 
9. మెట్లు తూర్పు నుండి పడమరకు, ఉత్తరం నుండి దక్షిణమునకు ఎక్కేవిధంగా వుండాలి.
 
10. మెట్లు బేసిసంఖ్యలో వుంటే మంచిది. కుడి పాదంతో మెట్లు ఎక్కడం మొదలుపెడితే పై ఫ్లోర్‌ఫై కుడిపాదం మోపుతూ చేరుతారు.
 
11. ఆగ్నేయంలో ఎట్టిపరిస్థితులలోనూ బెడ్‌రూమ్‌ని ఏర్పాటు చేసుకోరాదు. అలా ఏర్పాటు చేసుకుంటే నిప్పులమీద పడుకున్నట్లవుతుంది.
 
12. గుమ్మానికి ఎదురుగా గుమ్మం లేదా కిటికీ ఏర్పాటు చేసుకోవడం మంచిది.
 
13. ఇంటికి ఉత్తరం మరియు తూర్పు మూతపడకుండా చూసుకోవడం మంచిది.
 
14. కిటికీ తలుపులు బయటకు తెరుచుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంద్రకీలాద్రి అమ్మవారికి 63 గ్రాముల బంగారు గాజులు