Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#JaanuTrailer వచ్చేసింది.. ఆర్ యు వర్జీన్.. ఛీ ఏం మాట్లాడుతున్నావ్ జాను.. (video)

Advertiesment
Jaanu Trailer
, బుధవారం, 29 జనవరి 2020 (18:29 IST)
టాలీవుడ్ స్టార్స్ శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న తాజా మూవీ ''జాను''. తమిళ దర్శకుడు ప్రేమ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ తమిళ 96 సినిమా రీమేక్‌గా వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఇక, ఫిబ్రవరి 7వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా... 'జాను' మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేస్తోంది చిత్ర యూనిట్.
 
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు గోవింద్ వసంత్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల వచ్చిన టీజర్, సాంగ్స్ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. తాజాగా ట్రైలర్ తో 'జాను'పై మరింత హైప్ పెరిగిందనే చెప్పాలి. తమిళంలో హిట్ అయిన 96 సాంగ్ ఈ ట్రైలర్‌లోనూ వినిపించింది. అదిరిపోయే లిరిక్స్‌తో ఊహలే ఊహలే అంటూ సాగే పాట ప్రేక్షకులను కట్టిపడేసేలా వుంది. 
 
''ఇంకా నా కోసం ఓ చూపు అప్పుగా ఇవ్వలేవా... నీ ఓర చూపు కోసం, నీతో ఒక నవ్వు కోసం, రాత్రంతా చుక్కలు లెక్కబెడుతోంది నా హృదయం అంటూ శర్వా కవితాత్మక డైలాగులతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది.
 
ఆర్ యు వర్జీన్.. ఛీ ఏం మాట్లాడుతున్నావ్ జాను.., ఒక్కోసారి జీవితంలో ఏమీ జరగకపోయినా.. ఏదో జరగబోతుందని ముందే మనసుకు తెలిసిపోతుంది..,

10 నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమైతే.. ఇన్నాళ్లు మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే. నా రామ్ నన్ను వెతుక్కుంటూ వచ్చేశాడు. నా కోసం.. జాను కోసం అంటూ సాగే డైలాగులు అదిరిపోయాయి. సమంత, శర్వానంద్, వెన్నెల కిషోర్ నటన సూపర్‌గా వుంది. ఇంకేముంది..? జాను ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిశ్శబ్ధం విడుదల వాయిదా.. అనుష్క కెరీర్ సంగతేంటి?