Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైరాలో చ‌ర‌ణ్ మిస్ అయ్యాడు, ఎందుకో బ‌య‌ట‌పెట్టిన చిరు

Webdunia
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (20:49 IST)
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన తాజా చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సంచ‌ల‌న చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చా సుదీప్‌, త‌మ‌న్నా, జ‌గ‌ప‌తి బాబు, ర‌వికిష‌న్ త‌దిత‌రులు న‌టించారు.

అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించిన ఈ సినిమాలో మెగా ఫ్యామిలీ నుండి నిహారిక కొణిదెల ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టించారు. అలాగే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ ఈ సినిమాకు వాయిస్ ఓవ‌ర్‌ను అందించారు. 
 
అయితే... చ‌ర‌ణ్ మాత్రం న‌టించ‌లేదు. దీనికి కార‌ణం ఏంటి అని చిరంజీవిని అడిగితే... ఇంట‌ర్వెల్ ముందు వ‌చ్చే షేర్‌ఖాన్ అనే పాత్ర‌ను సంజ‌య్‌ద‌త్, స‌ల్మాన్‌ఖాన్‌ల‌లో ఎవ‌రో ఒక‌రితో చేస్తే బావుంటుంద‌ని అనుకున్నాం.

అలాగే చ‌ర‌ణ్‌తో కూడా చేయిద్దామ‌ని మ‌రో అభిప్రాయం కూడా విన‌ప‌డింది. ఆ పాత్ర‌ నాతో త‌ల‌ప‌డి యుద్ధం చేసే స‌మ‌యంలో సైరా నీలాంటి దేశ‌భ‌క్తుడు ఎంతో అవ‌స‌రం అంటూ నా చేతిలోని క‌త్తితో పొడుచుకుని చనిపోతుంది. 
 
చ‌ర‌ణ్ నా చేతిలో చ‌నిపోయేలా ఉండే ఆ పాత్ర‌లో న‌టిస్తే యాంటీగా అనిపిస్తుందనిపించింది. చివ‌ర‌కు స్క్రిప్ట్‌ను త‌గ్గించే క్ర‌మంలో పాత్రనే తీసేయాల్సి వ‌చ్చింది అని చెప్పారు. ఈ విధంగా చ‌ర‌ణ్ ఈ సినిమాలో న‌టించ‌క‌పోవ‌డమే కాకుండా.. చ‌ర‌ణ్ చేయాల్సిన పాత్రనే సినిమా నుంచి తేసేసార‌ట‌. అదీ... సంగ‌తి!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments