Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ప్రశ్న నన్నెందుకు అడిగారు? బ్రేకప్ పైన శ్రుతి హాసన్

Webdunia
ఆదివారం, 24 జనవరి 2021 (16:51 IST)
ప్రేమికులు విడిపోతే ఒక‌రికొక‌రు బాధ ప‌డ‌తారు. కొందురు మ‌ర్చిపోతారు. సినిమా ప్రేమ‌లు ఇలానే వుంటాయ‌ని చాలా మంది అనుకుంటుంటారు. కానీ సినిమా వాళ్ళ‌కు కూడా ప్రేమ‌లు వుంటాయి. కానీ అవి వ్య‌క్తం చేయ‌డానికి స‌రైన స‌మ‌యం రావాలి. చాలామంది హీరోయిన్ల ప్రేమ‌లో ప‌డి త‌ర్వాత విడిపోవ‌డం.. మ‌ర‌లా మ‌రొక‌రిని ప్రేమించ‌డం స‌హ‌జంగా జ‌రుగుతుంటుంది.

కానీ ఒక్కోసారి విడిపోయిన వ్య‌క్తి గురించి చెప్పాలంటే.. బాధ‌గా వుంటుంది. అది నిజమ‌ని... నాయిక శ్రుతిహాస‌న్ చెబుతోంది. చాలామంది హీరోయిన్లు సోష‌ల్ మీడియా వ‌చ్చాక అభిమానుల‌తో త‌న అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నారు. ల‌వ్‌లో బ్రేక‌ప్‌లు మామూలే. ఇలాంటిదే శ్రుతికి జ‌రిగింది. అది అంద‌రికీ తెలిసిందే.

ఇటీవ‌లే తెలుగులో `క్రాక్‌` సినిమాలో హిట్ కొట్టిన ఈ భామ‌... ప్రేమించి పెండ్లి చేసుకున్న భార్య‌గా జీవించింద‌నే చెప్పాలి. ఇటీవ‌లే సోష‌ల్‌ మీడియాలో ఆమెను ఓ అభిమాని.. అడిన ప్ర‌శ్న‌కు చాలా ఓపిక‌గా స‌మాధానం చెప్పింది. ఈ ఏడాదైనా వివాహం చేసుకుంటారా? అని అడిగిన అభిమానితో.. అది గాలివార్త అని కొట్టిపారేసింది.

అయితే మాజీ ప్రియుడు మైకేల్‌ గుర్తుకు వస్తే అస్యహం వేస్తుందా! అని ప్రశ్నిస్తే.. ఏమాత్రం త‌డ‌ప‌డ‌కుండా.. 'మీరు నిజంగా చెడ్డవారు. ఎందుకంటే, నేను ఎవరినీ అస్యహించుకోను. కాబట్టి నా దగ్గర సమాధానం లేదు. అయితే లోలోపల కాస్త బాధపడతాను' అని చాలా క్లారిటీగా సమాధానం చెప్పింది‌. ఇలాంటి అభిప్రాయాలు హీరోయిన్లు స‌హ‌జంగానే చెబుతుంటార‌ని.. అభిమాని అన‌డంతో... మ‌రెందుకు అడిగారంటూ.. తిరిగి రిప్ల‌యి ఇచ్చింది. సో.. అభిమానులు అడిగేట‌ప్పుడు జాగ్ర‌త్త సుమా!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హచ్ కుక్కను దొంగతనం, కూడూనీళ్లు లేకుండా బోరుమంటూ ఏడుస్తున్న కుటుంబం

నిర్మల్ : హోటల్‌లో భోజనం చేసిన MP మహిళ మృతి.. 9 మందికి అస్వస్థత

నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

భారత్ నుంచి వీచే గాలుల వల్లే పాకిస్థాన్‌లో కాలుష్యం పెరిగిపోతుంది : పంజాబ్ మంత్రి

శంషాబాద్ ఆలయంలో దేవతా విగ్రహాల ధ్వంసం.. ఎవరు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments