కోవిడ్ రాకుండా వుంటే ఎప్పుడో రిలీజ్ కావాలసిన క్రాక్ చిత్రం ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షో పడలేదు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల థియేటర్లకు రాలేదు క్రాక్. ఇకపోతే క్రాక్ చిత్రంలో పోతురాజు వీర శంకర్ పోలీసు పాత్రలో రవితేజకు మంచి మార్కులే పడ్డాయంటున్నారు. రవితేజ సరసన శ్రుతి హాసన్ నటించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ రవితేజకు హిట్ ఇవ్వడం ఖాయమని ట్విట్టర్ ద్వారా అభిమానులు షేర్ చేస్తున్న కామెంట్లను బట్టి తెలుస్తోంది.
ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ... 9వ తేదీనే ఎందుకు వచ్చామంటే... 13,14,15.. తేదీల్లో మూడు సినిమాలు వున్నాయి. థియేటర్లు డివైడ్ అవుతాయి. మేం మాస్ ఫిలింతో వస్తున్నాం. పండగకు అంటే 9వ తేదీ నుంచే ప్రజలకు ఆ వాతావరణంలో వుంటారు. అందుకే వచ్చాం. ఇక రవితేజ కెరీర్‌లో హయ్యస్ట్ థియేటర్లో విడుదలవుతుంది.
ఈ కథ 20 ఏళ్ళ క్రితం ఒంగోలు పరిసర ప్రాంతాల్లో జరిగిన కథ. సర్పయాగంలో కొన్ని సీన్లు అలా కనిపిస్తాయి. ఇందులో పూర్తిగా వుంటుంది. ఓ గ్యాంగ్.. బిర్యానీకోసం, 50,100 రూపాయలు కోసం మర్డర్లు చేస్తుంటారు. ఒంగోలులో 20 ఏళ్ళ క్రితం రౌడీయిజం వుండేది. వారు చేసే పనులు నేను చదువుకునే రోజు్లోల్ చాలా ఆసక్తిగా అనిపించేది.
డాన్ శ్రీను, బలుపు తర్వాత 3వ సినిమా నేచురల్ అప్రోజచ్ చేస్తే బాగుంటుందని అనిపించింది. రంగస్థలం లాంటి నేచురల్ సినిమాను లైక్ చేస్తున్నారు. అందుకే అప్పట్లో మా ఊరులోని కథను. సినిమాటిక్‌గా తీసుకుని కమర్షియల్ టచ్ చేస్తూ.. కల్పితం చేసి తీశాను. అదే క్రాక్.
ట్రైలర్‌లో చూపిన గేంగ్ చాలా రా.. గా వుంటారు. అప్పట్లో సీ కోస్ట్ ఏరియాలో కబడీ బేచ్ వుండేది. వారంతా. గాడిద నెత్తురు తాగి పరుగెడతారు.. అలా చేయకపోతే.. గడ్డకట్టి చచ్చిపోతారు. అందుకే అది తాగి పరుగెడితే.. గాడిదలాగా.. చర్మం మొద్దుబారిపోతుంది. అలాంటి గేంగ్.. చేసిన అరాచకాలకు క్రాక్ లాంటి పోలీస్ ఆఫీసర్ ఎటువంటి ముగింపు ఇచ్చాడనేది కథ.
సహజంగా అర్జున్ రెడ్డి నుంచి కానీ అంతకుముందు గానీ.. ఇంగ్లీషు టైటిల్ పెడుతున్నారు. అందుకే క్రాక్ అని పెట్టాం. దీనికి జనాలు అలవాటు పడిపోయారు. ఇందులో వరలక్ష్మీ శరత్‌కుమార్, డబ్బింగ్ రవి, సముద్రఖని కేరెక్టర్‌కు బాగా సూటయ్యారు. ఈ పాత్రలనీ ఒంగోలులో నేను చూసినవే అందుకే వారిని పెట్టాం.
జనాలు నేచులర్‌గా అబ్బిగా, సుబ్బిగా, నా కొడకా అనే పదాలు కేజువల్‌గా అంటుంటారు. అందుకే డైలాగ్‌లు బుర్రా సాయిమాధవ్. రాసిన సంభాషణలు హైలైట్‌గా నిలిచాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత అనూహ్య స్పందన వచ్చింది. కొత్త అవకాశాలు కూడా వచ్చాయి. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తాను అని చెప్పారు.