Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు మాట్లాడ‌గానే గొప్ప‌గా చూస్తున్నారుః రుషికా రాజ్

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (16:34 IST)
Rushika Raj
తెలుగు సినిమాల్లో ముఖ్యంగా చిన్న సినిమాల్లో ఎక్కువ‌గా క‌న్న‌డ న‌టీమ‌ణులే రాజ్య‌మేలుతున్నారు. టీవీల్లో స‌రేస‌రి. వారిదే రాజ్యం. క‌న్న‌డ‌న‌టి అయిన రుషికా రాజ్ తెలుగు నేర్చుకుని మాట్లాడుతుంటే అంద‌రూ గొప్ప‌గా చెబుతున్నార‌ట‌. ఈ విష‌యాన్ని చాలా ఆనందంగా చెబుతోంది. సాచీ క్రియేష‌న్స్ ప‌తాకం పై స్నేహా రాకేశ్ నిర్మాత‌గా, నూత‌న ద‌ర్శకుడు శేష్ కార్తీకేయ తెర‌కెక్కిస్తున్న చిత్రం అశ్మీ. పూర్తిగా వైవిధ్య‌మైన కాన్సెప్ట్ తో థ్లిల‌ర్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రుషికా రాజ్, రాజా నరేంద్ర‌, కేశ‌వ్ దీపిక లీడ్ రోల్స్ చేస్తున్నారు.
 
- నేను ఒక కన్నడ అమ్మాయిని. నేను కన్నడ లో మూడు   సినిమాలు చేశాను, తగరు అనే మూవీ నాకు మంచి పేరు తీసుకువచ్చింది. ఈ మూవీ పేరు అశ్మీ అంటేనే సంస్కృత పదం, నేను హీరోయిన్ గా చేయటానికి చాలా సంవత్సరాలు ఆగాను ఒక మంచి రోల్ చేయటానికి, అందరిలాగా చేయకూడదు చేస్తే సొసైటీ కి మంచి మెసేజీ వుండే క్యారెక్టర్ చేయాలి అనుకున్నాను, ప్రతి ఒక్క అమ్మాయి ఈ సినిమా నుంచి మెసేజ్ ఇవ్వాలి అని ఈ సినిమా చేశాను, ఈ సినిమా నేను మొదట ఒప్పుకునే అప్పుడు చాలా భయపడ్డాను ఈ సినిమా ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చాలా భయం వేసింది, ఈ సినిమా లో మహిళలు ఈ రోజుల్లో చాలా మంది పేస్ చేస్తున్న సమస్యలు ని ఈ సినిమా  లో చూపించటం జరిగింది, ఈ పాయింట్ నేను సినిమా చేయటానికి దోహద పడ్డది, 
 
- ఈ సినిమా లో యాక్టింగ్ కి చాలా స్కోప్ వున్న పాత్ర ఇది,నేను తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నాను అని అందరు చెప్తున్నారు న‌న్ను గొప్ప‌గా చూడ్డం జ‌రుగుతుంది. నేను తెలుగు నేర్చుకోవాటినికి రెండు సంవత్సరాలు పట్టింది, ఫస్ట్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అయిన డైరెక్టర్ గారు అయినా సినిమా ని ఓటిటి కోసం అని తీసి సినిమా బాగా వచ్చింది అని ఈ సినిమా ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు, 
 
- ఇది ప్రస్తుతం సమాజం లో ప్రతి మహిళా పేస్ చేస్తున్న క్యారక్టర్ ప్రతి మహిళా కి మెసేజీ రీచ్ అవ్వాలి అనేదే మా ఈ ప్రయత్నం అంటూ చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments