Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్‌కు అరుదైన గౌరవం

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (16:47 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్‌కు అపూర్వ గౌవరం లభించింది. కెనడాలోని మార్కమ్ అనే చిన్న పట్టణంలోని ఓ వీధికి ఏఆర్ రెహమాన్ పెరు పెట్టారు. 3.3 లక్షల జనాభా కలిగిన చిన్న పట్టణం ఇది. టొరంటోకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందిది. ఈ విషయాన్ని ఏఆర్ రెహమాన్ స్వయంగా పంచుకున్నారు. 
 
ఈ సందర్భంగా మార్కమ్ పట్టణ మేయర్ ఫ్రాంక్ స్కార్ పిట్టికి ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక స్టేట్ మెంట్ జారీ చేశారు. కెనడా ప్రజల పట్ల కృతజ్ఞత భావాన్ని చాటుకున్నారు. 
 
'నేను నా జీవితంలో ఇలాంటిది ఊహించలేదు. నిజంగా మీ అందరికీ, మార్కమ్ మేయర్ ఫ్రాంక్ స్కార్ పిట్టి, కౌన్సిలర్లు, ఇండియన్ కాన్సులేట్ జనరల్ (అపూర్వ శ్రీవాస్తవ), కెనడా ప్రజలకు కృతజ్ఞుడిని. 
 
ఏఆర్ రెహమాన్ అన్న పేరు నాది కాదు. దీనర్థం దయాగుణం. మనందరి ఉమ్మడి దేవుడి గుణం. దీనికి మనం సేవకులం. కనుక ఈ పేరు ప్రశాంతతను, ఐశ్వర్యాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని కెనడా ప్రజలకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ దేవుడి దీవెనలు ఉండాలి. 
 
భారత్‌లో నా పట్ల ప్రేమ చూపించే నా సోదరులు, సోదరీమణులకు సైతం నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎంతో సృజనాత్మకత కలిగిన వారు నాతో కలసి పనిచేసి నన్ను వందేళ్ల సినిమా ప్రపంచంలో సెలబ్రిటీని చేశారు. కానీ, నేను ఈ సముద్రంలో చిన్న బిందువును. విశ్రాంతి తీసుకోకుండా మరింత సేవ చేయాలని, స్ఫూర్తినీయంగా ఉండాలని నాపై బాధ్యతను ఇది పెంచింది' అని ఏఆర్ రెహమాన్ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments