Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాట్నా వీధుల్లో తిరుగుతున్న లైగర్ హీరో విజయ్ దేవరకొండ

Advertiesment
Vijay Devarakonda
, శనివారం, 6 ఆగస్టు 2022 (13:19 IST)
విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం లైగర్ కోసం దేశవ్యాప్తంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. తాజాగా పాట్నా వెళ్లాడు. అక్కడ ఛాయ్ వాలా దుకాణం దగ్గరికెళ్లి టీ-బిస్కెట్లు తిన్నాడు. ఫ్యాన్స్‌తో సెల్ఫీలకు ఫోజిలిచ్చి వారిలో హుషారు రేకెత్తించాడు.

 
డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లైగర్ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. మాస్ డైరెక్టర్ జగన్నాథ్ కాంబోలో విజయ్, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఇందులో రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో రొమాంటిక్ సాంగ్ అఫత్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో విజయ్ మరింత మాస్ లుక్‌లో కనిపించాడు. 

 
తాజాగా రిలీజ్ అయిన అఫత్ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో విజయ్, అనన్య మరింత రొమాంటిక్‏గా కనిపిస్తున్నారు. అలాగే లిరిక్స్ సైతం ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన అక్డీ పక్డీ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నికార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బింబిసార చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారో తెలుసా?