భారత్‌లో గూగుల్ స్ట్రీట్ వ్యూ సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. తొలుత హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన పది నగరాల్లో వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రముఖ సెర్చింజన్ గూగుల్ ప్రకటించింది. ఈ యేడాది ఆఖరు నాటికి 50 నగరాల్లో ఈ సేవలు ప్రారంభించాలని నిర్ణయించినట్టు గూగుల్ తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలో బుధవారం జరిగిన గూగుల్ ప్రతినిధులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
తొలి దశలో హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ, పూణె, నాసిక్, వడోదరా, అహ్మాదాబాద్, అమృత్‌సర్ వంటి నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు. ఆయా నగరాల్లో లక్షన్నర కిలోమీటర్లు స్ట్రీట్ వ్యూలో కవర్ అయినట్టు వారు వివరించారు. గూగుల్ స్ట్రీట్ వ్యూ ద్వారా ఓ వీధిని 360 డిగ్రీల పనోరమా షాట్స్‌లో వీక్షించవచ్చొని, కంప్యూటర్ లేదా మొబైల్‌లో గానీ గూగుల్ మ్యాప్ప్ ఓపెన్ చేసి 10 నగరాల్లో స్ట్రీట్ వ్యూలను చూడొచ్చని తెలిపారు.
నిజానికి గూగుల్ స్ట్రీట్ వ్యూ మ్యాచ్ సేవలను 15 యేళ్ల క్రితమే భారత్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. కానీ, భద్రతపరంగా ముప్పు ఏర్పడుతుందని భావించిన కేంద్రం ఈ సేవలపై గత 2016లో నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో స్థానిక టెక్ సంస్థలతో తాజాగా జట్టుకట్టిన గూగుల్ ఈ సేవలను మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. ఈ దఫా స్ట్రీట్ వ్యూతో పాటు ప్రమాదాలాను అరికట్టేందుకు వీలుగా మ్యాప్స్‌లో స్పీడ్ లిమిట్ ఆప్షన్‌ను సైతం గూగుల్ తెలిపింది. తొలుత బెంగుళూరు, చండీగఢ్ నగరాల్లో ఈ సేవలు ప్రారంభించినట్టు వారు వెల్లడించారు.