Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెస్టిండీస్‌ను వైట్ వాష్ చేసిన భారత క్రికెట్ జట్టు

team india
, గురువారం, 28 జులై 2022 (07:23 IST)
వెస్టిండీస్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఆతిథ్య జట్టుతో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ విజయం సాధించింది. దీంతో దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్‌ చేసింది. 
 
డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో భారత్‌ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్‌ 137 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌ 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌.. కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ (42, 32 బంతుల్లో 5x4, 1x6), బ్రెండన్‌ కింగ్‌ (42; 37 బంతుల్లో 5x4, 1x6) మాత్రమే టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. 
 
మిగతా బ్యాట్స్‌మెన్‌ మొత్తం చేతులెత్తేయడంతో విండీస్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఇక భారత బౌలర్లలో చాహల్‌ 4 వికెట్లు తీయగా శార్దూల్‌, సిరాజ్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ప్రసిద్ధ్‌, అక్షర్‌ పటేల్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు. 
 
అంతకుముందు భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ శిఖర్ ధావన్ (54 నాటౌట్) అర్థ సెంచరీతో రాణించాడు. అలాగే, శుభమన్ గిల్ (44) బాధ్యతాయుతంగా ఆడాడు. వీళ్లద్దరూ నిలకడగా ఆడటంతో భారత్ నిర్ణీత 36 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళల ప్రపంచ కప్ నిర్వహణ కోసం బీసీసీఐ బిడ్డింగ్?