Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోయెస్ట్ టికెట్ రేట్లకు 7 డేస్ 6 నైట్స్ విడుదల చేస్తున్నాం- ఎంఎస్ రాజు

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (17:21 IST)
M.S. Raju, Sumant Ashwin M, Rajinikanth S, Mehr Chahal, Kritika Shetty, Krishnakanth, Srinivasa Raju
మెగా మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా '7 డేస్ 6 నైట్స్'. మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. ఇందులో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలు. మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లు. 'డర్టీ హరి'తో గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఎంఎస్ రాజు, ఆ తర్వాత దర్శకత్వం వహించిన చిత్రమిది. జూన్ 24న విడుదల అవుతోంది. సోమవారం కొత్త ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 
 
మెగా మేకర్, '7 డైస్ 6 నైట్స్' దర్శకులు ఎంఎస్ రాజు మాట్లాడుతూ ''జూన్ 24న మా '7 డేస్ 6 నైట్స్' విడుదల చేస్తున్నాం. ఈ రోజు కొత్త ట్రైలర్ విడుదల చేశాం. చూశారు కదా... యూత్‌ఫుల్‌ ట్రైలర్. ఈ సినిమా విషయంలో నిర్మాణ భాగస్వాములు అయిన రజనీకాంత్ గారు, ఏజీబీ క్రియేషన్స్, శ్రీనివాస రాజుకు థాంక్స్. రామరాజు, కిరణ్ ఉపేంద్ర, విజయ్... మా టీమ్‌లో అందరికీ థాంక్స్. సినిమాకు వస్తే... లో బడ్జెట్ సినిమాగా తోసేయాలని అనుకోలేదు. చివరి క్షణం వరకు ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలని ట్రై చేశాం. థియేటర్ల దగ్గర పరిస్థితి ఎలా ఉందో తెలుసు. చిన్న సినిమా ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూపించాలని అనుకుంటున్నాం. '7 డేస్ 6 నైట్స్' అనే బాంబు తీసుకొస్తున్నాం. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రాలో ఎంత తక్కువ టికెట్ రేట్ ఉంటే అంతకు అమ్మమని డిస్ట్రిబ్యూటర్లకు చెప్పాను. ఓటీటీలో 'డర్టీ హరి'లో పెద్ద హిట్. ఈ '7 డేస్ 6 నైట్స్'ను యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా చూడాలని తక్కువ రేట్స్ పెడుతున్నాం. డీసెంట్ ఫిల్మ్ ఇది. అందరూ చూడొచ్చు. మార్చి తర్వాత 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2' సినిమాలు విడుదలయ్యాయి. హిట్స్ సాధించాయి. చిన్న సినిమాలు రావడానికి సరైన సమయం ఇదేనని భావిస్తున్నాను. ఇప్పుడు కాలేజీలు ఓపెన్ అయ్యాయి. అమ్మాయిలు, అబ్బాయిలు క్లాసులు ఎగ్గొడతారో? లేదో? వాళ్ళకు కావాల్సిన కంటెంట్ సినిమాలో ఉంది. ఈ సినిమాతో నిర్మాతలుగా మారిన మా అబ్బాయి, అమ్మాయికి ఆల్ ది బెస్ట్. సుమంత్ అశ్విన్ నటించిన సినిమాల్లో నాకు నచ్చిన చిత్రమిది. డీ గ్లామర్ రోల్ చేశాడు. తనతో పాటు రోహన్ లైవ్లీగా చేశారు. హీరోయిన్లు ఇద్దరూ కొత్తవాళ్లు అయినా బాగా చేశారు'' అని అన్నారు. 
 
ఎంఎస్ రాజు కుమార్తె రిషితా దేవి మాట్లాడుతూ ''జూన్ 24న తప్పకుండా థియేటర్లలో సినిమా చూడండి. నేను చూశా. నాకు బాగా నచ్చింది. ప్రేక్షకులు అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ నాన్నా'' అని అన్నారు. 
 
హీరో, ప్రొడ్యూసర్ సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ ''సినిమా రిలీజ్ కోసం మేమంతా చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాం. మేమంతా ఫస్ట్ కాపీ చూశాం. చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక్క మాటలో నిజాయతీగా చెప్పాలంటే... నాకు'7 డేస్ 6 నైట్స్' ఒక మాస్టర్ పీస్ లా కనిపించింది. మా పార్ట్‌న‌ర్స్‌, సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. జూన్ 24న థియేటర్లలో సినిమా చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు'' అని చెప్పారు. 
 
హీరో రోహన్ మాట్లాడుతూ ''నాకు అవకాశం ఇచ్చిన ఎంఎస్ రాజుగారికి థాంక్స్. నా స్నేహితులతో కలిసి సినిమా చూశా. వాళ్లకు బాగా నచ్చింది'' అని అన్నారు. 
ఈ కార్యక్రమంలో నిర్మాతల్లో ఒకరైన రజనీకాంత్ .ఎస్, హీరోయిన్లు మెహర్ చాహల్, కృతికా శెట్టి, లిరిక్ రైటర్ కృష్ణకాంత్ (కేకే), సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి, కో ప్రొడ్యూసర్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.0

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూకే పర్యటన కోసం పర్మిషన్ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు

Madhavi Latha: తాడిపత్రి వాళ్లు పతివ్రతలు కాబట్టి సినిమాల్లోకి రాకండి.. మాధవీ లత

పవన్ కల్యాణ్‌కు తలనొప్పి తెస్తున్న రేవ్ పార్టీలు.. మళ్లీ కొత్త కేసు.. ఎక్కడ?

Kumari Aunty : కుమారి ఆంటీ వ్యాపారంతో ట్రాఫిక్ జామ్.. వారం పాటు బంద్..

చైనాను చుట్టేస్తున్న HMPV వైరస్, లక్షణాలేంటి? భారత్ పరిస్థితి ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments