Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

డీవీ
శుక్రవారం, 31 జనవరి 2025 (18:00 IST)
Viswaksen, Akanksha Sharma
మాస్ కా దాస్ విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా' ఎక్సయిటింగ్  ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. విశ్వక్సేన్  సోను మోడల్, లైలాగా రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించడం చాలా క్యురియాసిటీ పెంచింది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. టీజర్, మొదటి రెండు పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు థర్డ్  సింగిల్ ఓహో రత్తమ్మ విడుదలైంది.
 
లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ఓహో రత్తమ్మ అందరినీ అలరించే మాస్ ఫీస్ట్ అందిస్తుంది. ట్రాక్ థ్రింపింగ్ టెంపో ప్రారంభం నుండి ముగింపు వరకు హై ఎనర్జీ ఇచ్చింది. పెంచల్ దాస్, మధుప్రియల జానపద శైలి వోకల్స్ ఈ పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి, పెంచల్ దాస్  రూరల్,  మాస్ సాహిత్యాన్ని అందించారు. సోషల్ మీడియా సెన్సేషనల్ ట్రాక్ కోయారే కోయ్ కోయ్ చేర్చడం పాటకు ఎక్స్ట్రా ఎంటర్ టైన్మెంట్ ని యాడ్ చేసింది.
 
విశ్వక్‌సేన్ ట్రెడిషినల్ నుంచి అల్ట్రా-స్టైలిష్ వరకు వివిధ రకాల లుక్స్ తో ఆకట్టుకున్నారు, పాటకు డైనమిక్ ఎనర్జీ ని యాడ్ చేశాడు. అతని డ్యాన్స్ మూమెంట్స్ ఎలిగెంట్ గా వున్నాయి. ఆకాంక్ష శర్మ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. సెట్టింగ్‌లు థీమ్‌కు  పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. కొరియోగ్రఫీ వైబ్‌ను మరింతగా పెంచింది. ఈ పాట థియేటర్లలోకి వచ్చినప్పుడు ప్రేక్షకులు విజల్స్ కోయ్టడం ఖాయం. ఇది అభిమానులకు పూర్తి స్థాయి మాస్ విందు.
 
లైలా చిత్రానికి స్క్రీన్‌ప్లే వాసుదేవ మూర్తి రాశారు, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాంచీపురం వకుళ సిల్క్స్.. దివ్వెల మాధురి కొత్త వ్యాపారం (video)

తిరగబడుతున్న అమెరికా కల, అక్కడున్న విద్యార్థికి నెలకి లక్ష పంపాల్సొస్తోంది

నేను దెబ్బ కొడితే ఇక లేవడం ఉండదు: రేవంత్ సర్కార్ పైన కేసీఆర్ పంచ్

కాంగ్రెస్ ఎమ్మెల్యేనా మజాకా... వెండితో బెడ్ మంచం... (Video)

వైద్యం వికటించి తండ్రి మృతి.. ప్రశ్నించిన కుమార్తెను కొట్టి చంపేసిన వైద్యుడు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments