Webdunia - Bharat's app for daily news and videos

Install App

విష్వ‌క్ సేన్ హీరోగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (18:24 IST)
Asokavanamlo Arjuna Kalyanam opening
ఫలక్‌నుమాదాస్‌, హిట్ వంటి వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో సూప‌ర్‌హిట్స్ అందుకున్న హీరో విష్వ‌క్‌సేన్‌. ఈయ‌న క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు.బి, సుధీర్ నిర్మిస్తోన్న ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ శుక్ర‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. దుర్గ (విష్వ‌క్ సేన్ అమ్మ‌గారు) ఈ సినిమా ముహూర్తపు స‌న్నివేశానికి క్లాప్‌కొట్టారు. విద్యాసాగ‌ర్ చింత ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు బాపినీడు.బి, సుధీర్ మాట్లాడుతూ, `అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే టైటిల్ ఎంత భిన్నంగా ఉందో, సినిమా కూడా అలాగే ఉంటుంది. ల‌వ్‌, ఫ‌న్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. ఇప్ప‌టి వ‌ర‌కు విష్వ‌క్ సేన్ న‌టించిన, న‌టిస్తోన్న చిత్రాల‌కు ఇది పూర్తి భిన్న‌మైన చిత్రం. విష్వ‌క్ లుక్ కూడా కొత్త‌గా ఉంటుంది.ఈ చిత్రానికి ర‌వికిర‌ణ్ రైట‌ర్‌. విద్యాసాగ‌ర్ చింత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమాలో హీరోయిన్ స‌హా ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ ఎవ‌ర‌నే విష‌యాన్ని త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం’’ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పెళ్లి చేసుకుంటానని.. లైంగికంగా వాడుకున్నాడు.. 20 ఏళ్ల జైలుశిక్ష

No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

Adilabad: ఆదిలాబాద్ గ్రామీణ పౌర సంస్థలకు ఎన్నికలు.. ఎప్పుడంటే?

Floods: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 50 ఏళ్ల తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు- భారీ నష్టం

Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్.. పండగ చేసుకుంటోన్న పవన్ ఫ్యాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments