Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హ‌న్సిక `105 మినిట్స్`లో ఏం చేస్తుందో తెలుసా!

Advertiesment
హ‌న్సిక `105 మినిట్స్`లో ఏం చేస్తుందో తెలుసా!
, శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (15:02 IST)
Hansika
రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో హన్సిక మోట్వాని ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం `105 మినిట్స్`. ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో  ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనం తో చేస్తున్న సింగిల్ షాట్ చిత్రం `105 మినిట్స్`.
సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్‌, రీల్ టైం & రియల్ టైం, ఈ చిత్రానికి హైలైట్స్ అని మునుపెన్నడూలేని విధంగా ఈ చిత్రంలో హన్సిక మోట్వాని ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో కనపడబోతోందని చిత్ర దర్శకుడు రాజు దుస్సా వివరించారు. 
 
ఈ చిత్రం తన కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచి పోతుంది అని చిత్ర కథానాయిక హన్సిక మోట్వాని తెలిపారు.
సినిమాటోగ్రాఫర్ దుర్గా కిషోర్ మాట్లాడుతూ ఈ సినిమా మేకింగ్ తనకు ఒక ఛాలెంజ్ అని అన్నారు. ఇలాంటి చిత్రాన్ని నా బ్యానర్ లో నిర్మించడం నాకు చాలా సంతోషంగా వుందని, చిత్ర నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని చిత్ర నిర్మాత బొమ్మక్ శివ వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధనుష్ సరసన కృతిశెట్టి.. కర్ణన్ సక్సెస్‌ చూసి బేబమ్మ ఓకే చెప్పేసిందట!