Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమాండింగ్ పర్సనాలిటీ కునాల్ కపూర్ ను స్వాగతించిన విశ్వంభర టీం

డీవీ
శుక్రవారం, 14 జూన్ 2024 (17:53 IST)
Kunal Kapoor
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ 'విశ్వంభర' మేకర్స్ ఒక్కో అనౌన్స్ మెంట్ తో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 
 
విశ్వంభరతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి దర్శకుడు వశిష్ట అన్నీ క్రాఫ్ట్స్ లో చాలా కేర్ తీసుకుంటున్నారు. విశ్వంభర టీమ్ ఇప్పుడు కమాండింగ్ పర్సనాలిటీ కునాల్ కపూర్ ను ఈ మ్యాజిస్టిక్ వరల్డ్ కి స్వాగతించింది. రంగ్ దే బసంతి, డాన్ 2, డియర్ జిందగీ మొదలైన అనేక బాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో నటించిన కునాల్ కపూర్ విశ్వంభరలో పవర్ ఫుల్ పాత్ర కోసం ఎంపికయ్యారు. మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు కునాల్ కు ఇది గొప్ప అవకాశం.
 
విశ్వంభరలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, ప్రముఖ డీవోపీ చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.
 
విశ్వంభర 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.
 
తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకటికి మించి ఓటరు గుర్తింపు కార్డులు ఉంటే సరెండర్ చేయాలి : ఈసీ

వైజాగా స్టీల్ ప్లాంట్‌కు ఎలాంటి ఢోకా లేదు : కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

Father: భార్యతో గొడవ.. ముగ్గురు బిడ్డల్ని పెట్రోల్ పోసి కాల్చేశాడు.. ఆపై పురుగుల మందు తాగి?

కిలేడీ లేడీ అరుణ వ్యవహారంలో తప్పంతా అధికారులదే : మంత్రి నాదెండ్ల

ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి వద్దు... : ప్రధాని నరేంద్ర మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

తర్వాతి కథనం
Show comments