రాబిన్‌హుడ్ లో లేడీ బాస్ నీరా వాసుదేవ్‌గా శ్రీలీల పరిచయం

డీవీ
శుక్రవారం, 14 జూన్ 2024 (17:38 IST)
Srileela
హీరో నితిన్ యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ 'రాబిన్‌హుడ్‌'లో డాజ్లింగ్ దివా శ్రీలీల ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. శ్రీలీలాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ ఆమె పాత్రను లేడీ బాస్ నీరా వాసుదేవ్‌గా పరిచయం చేశారు.
 
శ్రీలీల తన చుట్టూ టైట్ సెక్యురిటీతో  ప్రైవేట్ జెట్‌లో దిగినట్లు ఈ వీడియో ప్రజెంట్ చేస్తోంది. ఆమె వెయిట్ తెలియకపోయినా హెడ్ వెయిట్ ఇన్ఫినిటీ. ఆమె యారోగెంట్ క్యారెక్టర్ లో  కనిపిస్తుంది. టీజర్‌లో “జ్యోతీ, సునామీలో టి సైలెంట్‌ ఉండాలి... నా ముందు నువ్వు సైలెంట్‌గా ఉండాలి' అని శ్రీలీల చెప్పిన డైలాగ్ అలరించింది.
 
మూవీలో శ్రీలీల పాత్ర, నితిన్ పాత్రకు పూర్తి భిన్నంగా ఉంటుంది. నితిన్, శ్రీలీల పాత్రలు రాయడంలో వెంకీ కుడుముల స్పెషల్ కేర్ తీసుకున్నారు. విజువల్స్ గ్రాండ్‌గా అనిపించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్-క్లాస్‌గా వున్నాయి.
 
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయి ప్రొడక్షన్, టెక్నికల్ వాల్యూస్ తో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రానికి నిర్మాతలు. సాయి శ్రీరామ్ డీవోపీ గా పని చేస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్.
 
రాబిన్‌హుడ్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న విడుదల కానుంది.
 
నటీనటులు: నితిన్, శ్రీలీల, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఊరంతా కన్నీళ్లతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను సాగనంపారు

Hyderabad: నగరంలో ఏం జరుగుతోంది? డాక్టర్ ఇంట్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం

గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజరు రైలు: ఆరుగురు మృతి, పలువరికి తీవ్ర గాయాలు

Praja Darbar: ప్రజా దర్బార్.. నారా లోకేష్ కోసం క్యూలైన్‌లో నిలిచిన ప్రజలు

Shimla: ఉపాధ్యాయులా లేదా కీచకులా.. దళిత విద్యార్థిపై దాడి.. ఆపై ప్యాంటులో తేలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments