విశ్వక్ సేన్.. మెకానిక్ రాకీ దీపావళికి సిద్ధం

డీవీ
శుక్రవారం, 19 జులై 2024 (19:09 IST)
Viswak sen
హీరో విశ్వక్ సేన్ తన అప్ కమింగ్ మూవీలో 'మెకానిక్ రాకీ'గా అలరించబోతున్నారు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. హై బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.
 
మెకానిక్ రాకీ చిత్రాన్ని అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. గురువారం రాబోతున్న ఈ సినిమాకు లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ వుంటుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో విశ్వక్ సేన్ గన్, రెంచ్‌ను పట్టుకుని బాడ్ యాస్ అవతార్‌లో కనిపించారు. మెకానిక్‌గా తన క్యారెక్టర్ ప్రజెంట్ చేస్తూ, పోస్టర్‌లో ఓల్డ్ కార్స్ కూడా వున్నాయి. 
 
కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. మనోజ్ కటసాని డీవోపీ, అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్.
 
నటీనటులు: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శాతవాహన ఎక్స్‌ప్రెస్ స్టాపేజీపై ద.మ.రైల్వే కీలక నిర్ణయం

తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది

అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన మొంథా తుఫాను

Montha Effect: ఈ టైంలో బీచుల దగ్గర వీడియోస్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. నారా లోకేష్

చంద్రబాబు గ్రేట్.. హరీష్ రావు తండ్రి పట్ల సంతాపం.. మొంథా పనులు ఒకవైపు జరుగుతున్నా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments